Sarath Babu: 25 మంది పిల్లల్ని కన్న శరత్ బాబు..ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
Sarath Babu: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శరత్ బాబు.ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్, సినిమాల్లోకి వచ్చిన తర్వాత శరత్ బాబు గా ఆయన తన పేరు ని మార్చుకున్నాడు. రామరాజ్యం అనే సినిమాతో హీరో గా వెండితెర అరంగేట్రం చేసిన శరత్ బాబు, ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా, క్యారక్టర్ ఆర్టిస్టుగానే ఆయన ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. తెలుగు ,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలకు […]

Sarath Babu: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శరత్ బాబు.ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్, సినిమాల్లోకి వచ్చిన తర్వాత శరత్ బాబు గా ఆయన తన పేరు ని మార్చుకున్నాడు. రామరాజ్యం అనే సినిమాతో హీరో గా వెండితెర అరంగేట్రం చేసిన శరత్ బాబు, ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా, క్యారక్టర్ ఆర్టిస్టుగానే ఆయన ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. తెలుగు ,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలకు కలిపి సుమారుగా ఆయన 250 చిత్రాల్లో నటించాడు.
ఆయన వెండితెర పై ఆఖరుగా కనిపించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’. ఇందులో ఆయన పోషించింది 5 నిమిషాల పాత్రే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయ్యే క్యారక్టర్ చేసాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం గా ఉంది, ICU లో శస్త్ర చికిత్స చికిత్స చేయించుకుంటున్నాడు.ఈ సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి.
శరత్ బాబు కి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ తో పెళ్లి అయ్యింది,14 ఏళ్ళు వీళ్ళు కలిసి దాంపత్య జీవితం గడిపిన తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణం గా విడిపోవాల్సి వచ్చింది. రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్ద, అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రమాప్రభ తో విడిపోయిన తర్వాత శరత్ బాబు లతా దీక్షిత్ అనే అమ్మాయిని పెళ్లాడాడు.ఈమెతో కూడా ఎక్కువ కాలం ఆయన దాంపత్య జీవితం కొనసాగించలేదు.ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈయన మూడవ పెళ్లి కూడా చేసుకున్నాడు.
అయితే మూడవ భార్య గురించి ఆయన ఎలాంటి వివరాలు కూడా చెప్పలేదు.కొంతకాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మూడవ భార్య పేరు మిస్సెస్ శరత్ కుమార్ అంటూ చెప్పుకొచ్చాడు.అంతే కాదు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితె 25 మంది పిల్లలు అని ఆయన జవాబు ఇచ్చారు. తన పిల్లలతో పాటు తన అన్నయ్య, తమ్ముడు మరియు చెల్లెలు పిల్లలు కూడా నా పిల్లలే కదా అంటూ చెప్పుకొచ్చాడు శరత్ బాబు.
