Lakshmi Shirisha: చేతి రాతతో జీవితాన్ని మార్చుకుంది..: గృహిణి సక్సెస్ స్టోరీ
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయినా ఎక్కువ శాతం మంది మహిళలు ఆశయాలను సాధించలేకపోతున్నారు. కానీ పట్టుదల, ఓర్పు ఉంటే అనుకున్నది సాధించడం పెద్ద విషయం కాదని నిరూపించారు లక్ష్మీ శిరీష.

Lakshmi Shirisha: రంగం ఏదైనా విజయం ముఖ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ మెట్లు కూలిపోవచ్చు.. సహకరించకపోవచ్చు.. అయినా విజయపుటంచులను ముద్దాడుతారు చాలా మంది. ఓర్పు, నేర్పు నైపుణ్యాన్ని అలవర్చుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి గుణాలను సంతరించుకున్న ఓ మహిళ అడ్డంకులన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకెళ్లారు. చివరిని లక్ష్యాన్ని చేరారు. ఇప్పుడు హ్యపీగా ఉన్నారు. అయితే ఆమె అనుకున్న గమ్యం వేరు.. చేస్తున్న పని వేరు.. ఎలాగైతేనేం సంతృప్తినిచ్చిందంటున్నారు నిజాం పట్నం లక్ష్మీ శిరీష. తన చేతి రాతతో జీవితాన్నే మార్చుకున్న ఓ గృహిణి సక్సెస్ స్టోరీ మీకోసం..
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయినా ఎక్కువ శాతం మంది మహిళలు ఆశయాలను సాధించలేకపోతున్నారు. కానీ పట్టుదల, ఓర్పు ఉంటే అనుకున్నది సాధించడం పెద్ద విషయం కాదని నిరూపించారు లక్ష్మీ శిరీష. తాను చదువుకునే రోజుల్లో ఎన్నో కలలు.. ఆశయాలు.. కానీ కుటుంబ పరిస్థితులకు తలొగ్గి చదువు పూర్తయని వెంటనే 2014లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.అయితే అత్తింటివారు ఉద్యోగం చేయడానికి సహకరించారు. భర్త బ్యాంకు ఉద్యోగి. దీంతో తనను కూడా బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ చేయించారు. మూడేళ్లపాటు చాలా పరీక్షలు రాశారు. కానీ అప్పుడే గర్భం.
వెంటనే పుట్టింటికి రావడంతో మళ్లీ చదువుపై ఆసక్తి తగ్గిపోయింది. రెండో పాప పుట్టేవరకు పిల్లలతోనే గడపాల్సి వచ్చింది. ఆ తరువాత ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మళ్లీ మొదలైంది. అప్పుడు క్రాప్ట్ నేర్చుకోవాలని అనిపించింది. ప్రత్యేకంగా దీనికి శిక్షణ ఇచ్చేవారు ఉండలేరు. అందువల్ల యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ నేర్చుకున్నారు. చివరికి ‘నాతిచరామి’ అనే సంస్థను ప్రారంభించారు. పెళ్లికి సంబంధించిన వస్తువులను తయారు చేసి ఈ సంస్థ ద్వారా విక్రయించారు. మార్కెటింగ్ కోసం స్వయంగా షాపులకు వెళ్లేవారు. ఈ సమయంలో కొందరు నీకెందుకమ్మా ఇవన్నీ అని కామెంట్స్ చేశారు. శిరీష కష్టం చూడలేక వారు ఇలా అన్నా.. జీవితంలతో తనకు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న కోరిక సంస్థను నడపాల్సి వచ్చింది. ఆ తరువాత యూటబ్యూబ్ చానెల్ ‘ఫసీ, మెసీ’ ప్రారంభించారు. అదీ సక్సెస్ కాలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందారు.
ఇదే సమయంలో పిల్లలు స్కూల్స్ కు వెళ్తున్నారు. వారి చేతిరాతపై పాఠశాల నుంచి ఫిర్యాదులు వచ్చేవి. వారికి రైటింగ్స్ నేర్పించాలని అనేవారు. దీంతో యూట్యూబ్ లో స్క్రిప్టు కోసం వెతికాను. కర్సివ్, ప్రీ కర్సివ్, ప్రింట్, క్యాలిగ్రఫీ వంటివి నేర్చుకున్నా.. పాపకు కర్సివ్ రైటింగ్ నేర్పించారు. అది బాగా నచ్చడంతో చుట్టుపక్కలవారు తమ పిల్లలను నేర్పించాలని అడిగారు. అలా కొంతమందికి నేర్పించిన తరువాత ‘మ్యాంగో హ్యబీ క్లాసెస్’ను స్టార్ట్ చేశారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్లో పిల్లలకు చేతి రాత నేర్పించారు.
ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆమె ఇందులో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు లోకల్ వారికే కాకుండా విదేశాలైన బ్యాంకాక్, ఆస్ట్రేలియాలోని వారికి సైతం ఆన్ లైన్లో నేర్పిస్తున్నారు. అంతేకాకండా ఆమె కింద 13 మంది పనిచేస్తున్నారు. మొదట్లో చిన్న పిల్లలకు మాత్రమే నేర్పించారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా నేర్పించగలుగుతున్నారు. కేవలం 16 రోజుల్లోనే మంచి చేతిరాత వచ్చే లా ఆమె ప్రోత్సహిస్తున్నారు. సాఫ్ట్ వేర్ జాబ్ కంటే ఎక్కువగా సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మనం ఎందులో సక్సెస్ అవుతామోనన్న విషయం మనక్కూడా తెలియదు. ఆ విషయాన్ని తొందరగా గ్రహించిన వారు మిగతా వారి కంటే ముందే విజయం సాధిస్తారు. అందుకు నిదర్శనమే లక్ష్మీ శిరీష..
