2023 Cricket World Cup: అప్పుడెప్పుడో 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ఇండియా గెలుచుకుంది. అది కూడా ధోని సారథ్యంలో.. ఇప్పటివరకు ఆ ట్రోఫీని ముద్దాడింది లేదు. దీనికి తోడు 2007లో టి20 వరల్డ్ కప్ మొదటిసారి ప్రారంభించినప్పుడు గెలుచుకుంది. ఇంతవరకు మళ్లీ ఆ ట్రోఫీని దక్కించుకున్నది లేదు. మనకంటే ఇటు టి20 ర్యాంకింగ్స్, అటు వన్డే ర్యాంకింగ్స్ లో వెనుక ఉన్న వెస్టిండీస్ రెండుసార్లు, ఇంగ్లాండ్ రెండుసార్లు టి20 వరల్డ్ కప్ లను దక్కించుకున్నాయి. కానీ భారత్ మాత్రం ర్యాంకింగ్స్ లో మెరుగు, ఐసీసీ కప్ లలో తరుగు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కీలకమైన సమయంలో ఆటగాళ్లు తడబడుతుండడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

india
వీరిని ఇంకా ఎన్ని రోజులు మోయాలి
భారత జట్టు కీలకమైన ఐసీసీ టోర్నీలో ఆడేటప్పుడు కూర్పులేమితో ఇబ్బంది పడుతోంది. ప్రయోగాలు వివిధ టోర్నీల్లో చేస్తూ.. కీలకమైన మ్యాచుల్లో మాత్రం పాత పద్ధతిని అనుసరిస్తున్నది.. దీనివల్ల టోర్నీ మధ్యలోనే వెనుతిరిగాల్సి వస్తోంది. ఇటీవలి ఆసియా కప్ లో, టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఇదే సీన్ రిపీట్ అయింది. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో అయితే భారత జట్టు ఓడిపోయిన తీరు చూస్తే సగటు అభిమానికి కంటనీరు రాక తప్పదు. బహుశా ఇప్పట్లో ఆ మ్యాచ్ ఏ అభిమాని కూడా మర్చిపోకపోవచ్చు. ముందుగానే చెప్పినట్టు జట్టు కూర్పు విషయంలో లయ లోపిస్తోంది.. ఉదాహరణకి టి20 మెన్స్ వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ ను తీసుకున్నారు. కానీ అతడు పూర్తిగా నిరాశ పరిచాడు. దినేష్ కార్తీక్ కూడా అంతకంటే గొప్పగా ఏమీ ఆడటం లేదు. వాస్తవానికి క్రికెట్లో ఆట తీరుకే విలువ ఉంటుంది. ఎప్పుడో సెంచరీలు కొట్టేసాం. ఇప్పటికీ జట్టులో కొనసాగుతాం అంటే కుదరదు.. కానీ దుదృష్ట వశాత్తూ ఇండియన్ టీం లో అదే జరుగుతోంది.
ఎవరు ఉండాలి
శిఖర్ ధావన్ స్ట్రైక్ రేటు బాగో లేదు. ఆడితే ఆడతాడు లేకుంటే లేదు. పైగా వయసు కూడా 37 ఏళ్ళకి వచ్చింది. ఇక శార్దూల్ ఠాకూర్ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. వీరందరినీ కూడా పక్కన పెట్టాల్సిందే. సొంత దేశంలో టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు కూర్పు విషయంలో టీం జాగ్రత్త తీసుకోకపోతే అంతే సంగతులు. హుడా, చాహాల్ వంటి వారిని దూరం పెట్టాల్సిందే. వీరికి అవకాశాలు ఇవ్వడం వల్ల మిగతా ఆటగాళ్ళు రిజర్వ్ బెంచ్ కు పరిమితం అవుతున్నారు.. దీని వల్ల గెలవాల్సిన మ్యాచ్లో ఇండియా ఓడిపోతున్నది.

india
వీళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిందే
న్యూజిలాండ్ తో జరుగుతున్న సీరిస్ లో శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ రాణిస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొంటున్నారు. సూర్య కుమార్ యాదవ్ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. సంజూ శాం సన్ కూడా పర్వా లేదు. రిషబ్ పంత్ ను ఎంత త్వరగా వదిలించుకుంటే జట్టుకు అంత మంచిది. ఇక బౌలింగ్ విషయంలో అర్ష్ దీప్ సింగ్ జోరు కొనసాగిస్తున్నాడు. కానీ ఈ ఒక్కడు మాత్రమే బౌలింగ్ దళాన్ని మోయలేడు. కాకపోతే ఇతడు బమ్రా కు తోడుగా ఉంటే ఇక ఇబ్బంది ఉండదు. భువనేశ్వర్ కుమార్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇతగాడు సాధన చేయాల్సిందే. లేకపోతే పక్కన పెట్టడం ఉత్తమం. ఇక హైదరాబాదీ సంచలనం మహమ్మద్ సిరాజ్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి. అతని బౌలింగ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని జట్టు కోచ్ లు మరవకూడదు. ఇక కాశ్మీర్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ కూడా మెరుగ్గా బౌలింగ్ వేస్తున్నాడు. ఇతడిని మరింత సాన పెడితే టీం ఇండియాకు ఇబ్బంది ఉండదు. బ్యాటింగ్ లో కే ఎల్ రాహుల్ స్థిరంగా ఆడటంలేదు. రోహిత్ శర్మ కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేయడం లేదు. ఇలాంటి సమయంలో ఓపెనర్ల బాధ్యతలను యువ ఆటగాళ్లకి ఇవ్వాలి. శుభ్ మన్ గిల్, సంజూ శాం సన్ కు అవకాశం ఇస్తే ఫలితం వేరే విధంగా ఉంటుంది.. యువకులు కాబట్టి ధాటిగా అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నది. ఇండియా కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో స మూల మార్పులు చేయాలి. అప్పుడే స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ ను మరోసారి దక్కించుకునే అవకాశం ఉంటుంది.