Study Abroad: ఈ దేశాల్లో ఇండియన్స్ ఉచితంగా చదువుకోవచ్చు.. వెంటనే వెళ్లిపోండి

స్లోవెనియా దేశం కూడా విదేశీ విద్యార్థుల కోసం ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇక్కడ ఎలాంటి స్టడీ కోసమైనా తక్కువ ఫీజును వసూలు చేస్తాయి. మిగతా దేశాల్లో కంటే మినిమం కాస్ట్ మాత్రమే వసూలు చేస్తారు.

  • Written By: SS
  • Published On:
Study Abroad: ఈ దేశాల్లో ఇండియన్స్ ఉచితంగా చదువుకోవచ్చు.. వెంటనే వెళ్లిపోండి

Study Abroad: జీవితంలో ఒకప్పుడ చదువు తప్పనిసరి కాదు.. కానీ ఇప్పుడు చదువే జీవితం.. చదువుకోని వారికి అసలు లైఫే లేదనే పరిస్థితి.. మారుమూల పల్లెల్లో ఉన్నవారు సైతం ఎంతో కొంత చదువుకోవానే తపన పెరిగింది. పట్టణాల్లో ఉన్నవారికి విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక పుడుతుంది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో చాలా మందికి విదేశాల్లో చదువుకోవాలని ఆశ ఉన్నా.. దానిని నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు ఉచితంగా చదువును అందిస్తున్నారు. ఈ దేశాల్లోకి రావడానికి కొన్నిఖర్చులు భరిస్తే.. చదవును ఉచితంగా అందిస్తున్నాయి. ఇవి భారతీయులకు కూడా వర్తిస్తాయి. ప్రపంచంలో ఉచితన విద్యను అందించే ఆ దేశాలేవో ఇప్పుుడు తెలుసుకుందాం.

జర్మనీ:
విదేశీ విద్యార్థులను ఎక్కువగా ఆహ్వానించే దేశాల్లో జర్మనీ ఒకటి. ఉన్నత విద్యనభ్యసించాలనుకునేవారికి జర్మనీ బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. జర్మనలో చదువును అందించే పబ్లిక్ యూనివర్సిటీలో ట్యూషన్ ను ఫీజును తీసుకోవు. ఇంగ్గీష్ మీడియంలో ప్రత్యేకంగా చదుకుకోవాలనుకునే ఇండియన్స్ కు జర్మనీ అనుగుణంగా ఉంటుంది. ఇక్కడున్న విశ్వవిద్యాలయాల్లో వెయ్యి కంటే ఎక్కువగా కోర్సులు విదేశీ విద్యార్థుల కోసం ఆఫర్ చేస్తున్నాయి. జర్మనీలోని హైడెల్ బర్గ్, టెక్నికల్ యూనివర్సిటీ ఆప్ మ్యూనిచ్, కార్ల్స్ రూహెర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హంబోల్డ్ యూనివర్సిటీలు ఇటీవల 100 శాతం ఫీజు మినహాయింపునుప్రకటించాయి.

నార్వే:
విదేశీ విద్యార్థులకు ఉచితంగా విద్యనందించే దేశాలలో నార్వే టాప్ ప్లేసులో ఉంటుంది. ఇక్కడున్న నార్వేజియ్ విశ్వవిద్యాలయాలు, స్టేట్ యూనివర్సిటీలకు ఎక్కువ భాగం పబ్లిక్ నిధులు వస్తుంటాయి. నార్వేలోని బెర్గెన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ నార్డ్ ల్యాండ్, నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలు ఉచితంగా విద్యనందిస్తాయి. అయితే విద్యార్థులు లివింగ్ కాస్ట్ మాత్రం భరించాల్సి ఉంటుంది.

ఫిన్ లాండ్:
2017 వరకు ఈ దేశం సొంత విద్యార్థులకు మాత్రమే ఉచితంగా విద్యనించింది. ఆ తరువాత అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఫీజును తీసుకుంటుంది. అయితే వీటిని కూడా స్కాలర్ షిప్ ద్వారా ఫ్రీగా విద్యను పొందవచ్చు. అయితే స్వీడన్ భాషలో చదివే వారికి మాత్రమే ఉచితంగా అందిస్తుంది. అంతర్జాతీయ ఇంగ్లీష్ లో చదువాలనుకునేవారు మాత్రం మినిమం చెల్లించాల్సి ఉంటుంది.

స్వీడన్:
స్విట్జర్లాండ్ పాస్ పోర్టు కలిగిని ప్రతీ విద్యార్థి స్వీడన్ లో చదువుకోవచ్చు. యూరోపియన్ విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందిస్తుండగా.. నాన్ యూరోపియన్ స్టూడెంట్స్ కు అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కూడా కొన్ని స్కాలర్ షిప్ లు వస్తే వెసులుబాటు ఉంటుంది.

ఆస్ట్రియా:
ఆస్ట్రియా దేశంలో చదువానుకునే విదేశీ విద్యార్థులు పూర్తిగా ఉచితం కాకుండా..తక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెమిస్టర్ కు 1500 యూరోస్ మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు ఉన్నత విద్యకోసం కూడా వర్తిస్తుంది. పీహెచ్ డీ, ఇతర ప్రొగ్రామ్ లు చేయాలనుకునేవారికి సైతం నామమాత్రపు ఫీజునే తీసుకుంటారు.

క్రెచ్ రిపబ్లిక్:
క్రెచ్ రిపబ్లిక్ విదేశీ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తుంది. ట్యూషన్ ఫీజు, ఇంగ్లీష్ మాద్యమాలు చేసేవారికి కూడా లో కాస్ట్ ఫీజు ఉంటుంది. ఇది ఇండియన్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది.

స్లోవెనియా:
స్లోవెనియా దేశం కూడా విదేశీ విద్యార్థుల కోసం ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇక్కడ ఎలాంటి స్టడీ కోసమైనా తక్కువ ఫీజును వసూలు చేస్తాయి. మిగతా దేశాల్లో కంటే మినిమం కాస్ట్ మాత్రమే వసూలు చేస్తారు.

బెల్జియం:
ఈ దేశంలోని పబ్లిక్ యూనివర్సిటీస్ తక్కువ టూషన్ ఫీజును తీసుకుంటాయి. ఇది ఇండియన్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ఫీజు ప్రాంతాలను భట్టి నిర్ణయిస్తూ ఉంటారు.

తైవాన్:
తైవాన్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల కోసం ట్యూషన్ ఫీజు తీసుకుంటుంది. కానీ స్కాలర్ షిఫ్ ద్వారా సెలెక్టెడ్ స్టూడెంట్స్ కు తక్కువ ఫీజు తీసుకుంటారు. భారతీయ విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకోవచ్చు.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు