India Vs Australia T20 Series 2023: ఆస్ట్రేలియాతో టి 20 సీరీస్ కి ఇండియన్ టీమ్ ఎంపిక…కెప్టెన్ ఎవరంటే..?
ఆస్ట్రేలియా టీంతో ఐదు టి 20 మ్యాచ్ లు ఆడడానికి ఇండియన్ టీమ్ రెడీ అయింది.అందులో భాగంగానే సీనియర్ ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్స్ తో ఈ టి 20 మ్యాచ్ లను ఆడించాలని బీసిసిఐ చూస్తుంది.

India Vs Australia T20 Series 2023: ఇక రీసెంట్ గా వరల్డ్ కప్ 2023 ముగిసింది.ఇక ఇందులో ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ కప్ సాధించి చరిత్రలో నిలిచింది.ఇక దీంతో ఆస్ట్రేలియా ఆరోవసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది. ఇక అందులో భాగంగానే ఇండియా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం 23వ తేదీ నుంచి ఆస్ట్రేలియా టీంతో ఐదు టి 20 మ్యాచ్ లు ఆడడానికి ఇండియన్ టీమ్ రెడీ అయింది.అందులో భాగంగానే సీనియర్ ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్స్ తో ఈ టి 20 మ్యాచ్ లను ఆడించాలని బీసిసిఐ చూస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ ఐదు టి 20 లో అనడానికి ప్లేయర్లను సెలెక్ట్ చేశారు.ఇక ఎవరు ఊహించని విధంగా ఈ సీరీస్ కి సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా చేశారు.ఇక రుతురాజ్ గైక్వాడ్ ని వైస్ కెప్టెన్ గా నియమించింది.
ఇక రీసెంట్ గా ఋతురాజు గైక్వాడ్ తన సారథ్యంలో చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. అందుకే అతన్ని ఈ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరి కంటే సీనియర్ అయిన శ్రేయాస్ అయ్యర్ ని కెప్టెన్ గా పెడితే బాగుండేది కదా అంటూ మాజీ ప్లేయర్లు చాలా అసక్తి కరమైన విషయాలను తెలియజేస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్ కంటే కూడా సూర్యకుమార్ యాదవ్ కే బీసీసీఐ ఎక్కువ మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది… ఇక ఒకసారి ఈ సిరీస్ కి ఎంపిక చేసిన ప్లేయర్ల వివరాలను కనుక చూసుకున్నట్లయితే…
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్…
ఇక వీళ్లతోనే ఇండియన్ టీమ్ టీ20 సిరీస్ ఆడడానికి రెడీ అవుతుంది.ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , మహమ్మద్ షమీ, శుభ్ మన్ గిల్ లాంటి వారికి రెస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు కంటిన్యూస్ గా సిరీస్ లు ఆడుతూ ఉండడం వల్ల కొంచెం రెస్ట్ కావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇక అందులో భాగంగానే వాళ్ళకి రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్లతో ఈ సిరీస్ ని ఆడించాలని బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది…
ఇక 23 వ తేదీన విశాఖపట్నం లో మొదటి టి 20 మ్యాచ్ జరగనుండగ,
26 వ తేదీన తిరువనంతపురం లో రెండోవ టి 20 మ్యాచ్ ఆడనుంది…
ఇక 28 వ తేదీన గౌహతి లో 3వ టి 20 మ్యాచ్ ఆడనుంది…
ఇక డిసెంబర్ ఒకోటవ తేదీన రాయ్ పూర్ లో నాల్గోవ టి 20 మ్యాచ్ జరగనుంది…
ఇక మూడోవ తేదీన బెంగుళూర్ లో అయిదోవ టి 20 మ్యాచ్ జరగనుంది…
