అమెరికాను వ‌దిలేస్తున్న ఇండియన్స్!

విదేశీ చ‌దువులైనా.. ఉద్యోగ‌మైనా.. భార‌తీయుల ఫ‌స్ట్ ఛాయిస్ ఏదీ అంటే ఏం చెబుతారు? స‌హ‌జంగా ఎవ‌రైనా అమెరికా అని అంటారు. కానీ.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారిపోయింది. ఆ ప్లేసును కెన‌డా భ‌ర్తీ చేసింది. భార‌తీయులు క్ర‌మంగా అమెరికాను వ‌దిలేస్తున్నారు. యూఎస్ కు గుడ్ బై చెబుతూ.. కెన‌డాకు జై కొడుతున్నారు. రానురానూ ఈ ప‌రిస్థితి వేగంగా విస్త‌రిస్తోంది. మ‌రి, ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మేంటీ అన్న‌ప్పుడు ప‌లు అంశాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా.. రాజ్య‌స‌భ‌లో ఓ స‌భ్యుడు అడిగిన […]

  • Written By: Bhaskar
  • Published On:
అమెరికాను వ‌దిలేస్తున్న ఇండియన్స్!

విదేశీ చ‌దువులైనా.. ఉద్యోగ‌మైనా.. భార‌తీయుల ఫ‌స్ట్ ఛాయిస్ ఏదీ అంటే ఏం చెబుతారు? స‌హ‌జంగా ఎవ‌రైనా అమెరికా అని అంటారు. కానీ.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారిపోయింది. ఆ ప్లేసును కెన‌డా భ‌ర్తీ చేసింది. భార‌తీయులు క్ర‌మంగా అమెరికాను వ‌దిలేస్తున్నారు. యూఎస్ కు గుడ్ బై చెబుతూ.. కెన‌డాకు జై కొడుతున్నారు. రానురానూ ఈ ప‌రిస్థితి వేగంగా విస్త‌రిస్తోంది. మ‌రి, ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మేంటీ అన్న‌ప్పుడు ప‌లు అంశాలు క‌నిపిస్తున్నాయి.

తాజాగా.. రాజ్య‌స‌భ‌లో ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి ముర‌ళీధ‌ర‌న్ ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో ఇండియ‌న్ స్టూడెంట్స్ 2,11,930 మంది విద్యార్థులు ఉండ‌గా.. కెన‌డాలో అంత‌క‌న్నా ఎక్కువ‌గా 2,15,720 మంది ఉన్న‌ట్టు తెలిపారు. మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా 99 దేశాల్లో భార‌త‌ విద్యార్థులు చ‌దువుకుంటున్నార‌ని, వారు 11.33 ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్టు తెలిపారు.

గ‌తంలో భార‌తీయ విద్యార్థులు, ఉద్యోగ‌స్తులు అమెరికాను ఫ‌స్ట్ ప్ర‌యారిటీగా ఎంచుకునేవారు. కానీ.. ట్రంప్ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితుల్లో చాలా మార్పు వ‌చ్చింది. వీసాల విష‌యంలో, గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఒక దశలో విదేశీయులంద‌రినీ సొంత దేశాల‌కు పంపించేస్తారా? అనే ఆందోళ‌న‌ల‌ను కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో.. అమెరికాను వీడ‌డ‌మే శ్రేయ‌స్క‌ర‌మ‌నే ఆలోచ‌న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ధానంగా.. హెచ్‌1 బీ వీసాలు జారీచేసే విష‌యంలో అమెరిక వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా.. భార‌తీయ నిపుణులు అమెరికాను వ‌దిలేయ‌డానికి కార‌ణం అవుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అమెరికాలో చ‌దువుతున్న విదేశీ విద్యార్థుల్లో అత్య‌ధికంగా చైనా వాళ్లు ఉన్నారు. ఆ త‌ర్వాత స్థానం భార‌తీయుల‌దే. ప్ర‌స్తుతం సుమారు 1.93 ల‌క్ష‌ల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. అయితే.. డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత‌.. వీసాలు జారీచేయ‌డం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. విద్యార్థుల‌తోపాటు అమెరికాలో ఉద్యోగం చేసుకోవాల‌నే వారి ప‌రిస్థితి కూడా ఆందోళ‌నక‌రంగా త‌యారైంది.

ఇక‌, క‌రోనా నేప‌థ్యంలో 2019 నుంచి 2020 మ‌ధ్య విద్యార్థుల వీసాల‌ను ఏకంగా 64 శాతం మేర త‌గ్గించారు. 2019 ఆర్థిక సంవ‌త్స‌రంలో 4.4 శాతం భార‌త విద్యార్థుల‌కు అమెరికా వీసా ఇవ్వ‌లేదు. అక్క‌డి యూనివ‌ర్సిటీల్లో అడ్మిష‌న్ తీసుకున్న త‌ర్వాత ఈ ప‌రిస్థితి రావ‌డం గ‌మ‌నార్హం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.

విద్యార్థుల ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఉద్యోగుల ప‌రిస్థితి మ‌రో విధంగా ఉంది. అక్క‌డ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని భావించే వారికి గ్రీన్ కార్డు మంజూరు చేయడానికి సైతం ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో దాదాపు 20 ల‌క్ష‌ల మంది గ్రీన్ కార్డు అప్లికేష‌న్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో.. గ్రీన్ కార్డు ఎప్పుడో వ‌స్తుందో.. అస‌లు వ‌స్తుందో రాదో.. అనే టెన్ష‌న్ మొద‌లైంది. అమెరికాలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. కెన‌డాలో సానుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. అవ‌కాశాల‌తోపాటు ఆ దేశంలో నిబంధ‌న‌లు కూడా సుల‌భ‌త‌రం కావ‌డంతో.. అక్క‌డికి వెళ్లేందుకే ఆస‌క్తి చూపుతున్నారు భార‌తీయులు. ఇలాంటి వారి సంఖ్య రానురానూ పెరుగుతోంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Read Today's Latest Uncategorized News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు