Sunil Gavaskar- MS Dhoni: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న క్రికెట్ దిగ్గజం.. ఫ్యాన్స్ ఫిదా!
గెలవడం ఓడిపోవడం సంగతి పక్కనబెడితే.. ధోనీ చేసిన పని అందరినీ షాక్‌లోకి తీసుకెళ్లిపోయింది. మరో దిగ్గజ క్రికెటర్ చేసిన పని అయితే.. ధోనీ ఫ్యాన్స్ జీవితాంతం కాలర్ ఎగరేసుకునేలా చేసింది.

Sunil Gavaskar- MS Dhoni: ఐపీఎల్ సీజన్ 16లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకవైపు చివరి బంతి వరకు ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. మరోవైపు క్రికెటర్ల గిల్లికజ్జాలు, ఇంకోవైపు తక్కువ స్కోర్‌కు ఆల్‌ఔట్ మ్యాచ్‌లు చూశాం. తాజాగా ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. బహుశా టోర్నీ చరిత్రలో ఇలాంటి మరోసారి జరగకపోవచ్చు కూడా.. ఇందులో ధోనీ ఉండటం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
రిటైర్మెంట్‌పై క్లారిటీ..
ఐపీఎల్‌లో ధోనీకి ఇది లాస్ట్ సీజన్ కాదు. దీని గురించి స్వయంగా అతడే ఓ మ్యాచ్ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. చెప్పింది వేరు రియాలిటీలో జరుగుతున్నది వేరు. ధోనీ చేస్తున్న పనులు చూస్తుంటే బాధ, గర్వం అనే రెండు ఎమోషన్స్ ఒకేసారి వస్తున్నాయి. ఈ ఐపీఎల్‌లో సీఎస్కే జట్టు లీగ్ దశలో చెన్నైలో తన లాస్ట్ మ్యాచ్ ఆడేసింది. కానీ కోల్ కతాపై ఓడిపోయింది.
ధోనీ చేసిన పనికి షాక్..
గెలవడం ఓడిపోవడం సంగతి పక్కనబెడితే.. ధోనీ చేసిన పని అందరినీ షాక్‌లోకి తీసుకెళ్లిపోయింది. మరో దిగ్గజ క్రికెటర్ చేసిన పని అయితే.. ధోనీ ఫ్యాన్స్ జీవితాంతం కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఈ ఐపీఎల్ లో మోస్తరు ప్రదర్శన చేస్తూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 13 మ్యాచుల్లో ఏడింటిలో గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఓ పాయింట్ వచ్చింది. దీంతో 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా కోల్‌కతాతో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో ఇదే తనకు చివరి మ్యాచ్ అన్నట్లు ధోనీ.. స్టేడియం మొత్తం తిరుగుతూ ఫ్యాన్స్‌కి అభివాదం చేస్తూ సందడి చేశాడు. ఈ ఫొటోల్ని చెన్నై జట్టు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నావా అంటూ తెగ బాధపడుతున్నారు. ధోనీ రిటైర్మెంట్ అనేది.. చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్లి కప్ గెలుచుకున్నాక ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ధోనీ రిటైర్మెంట్ ఇచ్చేయడం గ్యారంటీ అనిపిస్తోంది.
అరుదైన గౌరవం..
అయితే ఇప్పటివరకు ఏ కెప్టెన్‌కు దక్కని గౌరవం ధోనీకి దక్కింది. అదే టీమింటియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావాస్కర్.. ఏకంగా ధోనీ ఆటోగ్రాఫ్‌ని తన షర్ట్ పై తీసుకున్నాడు. అది కూడా స్టేడియంలో అందరూ చూస్తుండగానే. దీన్ని ఐపీఎల్‌లో జరిగిన అద్భుతమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ కెప్టెన్‌కి గానీ క్రికెటర్‌కి గానీ భవిష్యత్తులోనూ ఇలాంటి అవకాశం రాదు. ఇది కచ్చితంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ధోనీ లాంటి మరొకడు రాడు, రాలేడు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ధోనీని దిగ్గజ క్రికెటరేతోపు అని ఒప్పుకొన్నాడు. ఇక ఈ జన్మకి ఇది చాలు అని అనుకుంటున్నారు.
