Indian army : మరో సంచలనం : పాకిస్తాన్ లోకి భారత సైన్యం.. యుద్ధం మొదలవుతుందా?
ప్రస్తుతం భారత జవాన్లు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా బఫర్ జోన్లలోకి దూసుకెళ్తున్నారు. అక్కడ ఉగ్రవాదులే లక్ష్యంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Indian army : ఒకప్పుడు భారత సైన్యం మీద ఉగ్రవాదులు దాడులు చేస్తే.. ప్రతిదాడి చేసేందుకు ఉత్తర్వుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. ఎవడైనా చొరబాటుకు ప్రయత్నిస్తే.. సరిహద్దుల్లో ఆగడాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తే క్షణం కూడా ఆలస్యం చేయడం లేదు. అలాంటి ముష్కరులను ఇండియన్ ఆర్మీ వెంటనే లేపేస్తోంది. అందువల్లే సరిహద్దుల్లో కొంతమేర ఉద్రిక్తలు తగ్గాయి.. అయితే ఇటీవల అనంత్ నాగ్, ఉరి జిల్లాల పరిధిలో ఉగ్రవాదులు రాక్షసకాండ కు పాల్పడ్డారు. ముగ్గురు భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న భారత జవాన్లు వెంటనే ఉగ్రవాదుల మీద విరుచుకుపడ్డారు. ఆరు రోజులుగా సరిహద్దుల వెంట ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం మొదలుపెట్టారు.
ఈ తనిఖీల్లో భారత జవాన్ల పైకి ఎదురు కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఏరి వేశారు.. నాలుగు రోజుల క్రితం ముగ్గురిని, నిన్న మరో ఇద్దరిని కాల్చిపడేశారు. సాధారణంగా సరిహద్దుల వెంట మాత్రమే గస్తీ కాసే భారత జవాన్లు.. ఈసారి ఏకంగా బఫర్ జోన్లలోకి ప్రవేశించారు. భారత్ పాకిస్తాన్ మధ్య బఫర్ జోన్ ప్రాంతం చిన్నపాటి అడవుల్లాగా మారిపోయింది. అయితే ఈ అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. చిన్నపాటి సొరంగాలు తవ్వి అందులో ఉంటున్నారు. అక్కడి నుంచి క్రమంగా భారత సరిహద్దుల వైపుకు దూసుకు వస్తున్నారు. ఆ సొరంగాల్లో ఉంటూ భారత సైన్యం పైకి కాల్పులు జరుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న మూడు మరణాలు కూడా.. ఉగ్రవాదులు ఇలా కాల్పులు జరపడం వల్లే జరిగాయి.
అయితే ప్రస్తుతం భారత జవాన్లు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా బఫర్ జోన్లలోకి దూసుకెళ్తున్నారు. అక్కడ ఉగ్రవాదులే లక్ష్యంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఉగ్రవాదులను రక్షించేందుకు నేరుగా పాకిస్తాన్ ప్రభుత్వం గనుక రంగంలోకి దిగితే కచ్చితంగా భారత్ యుద్ధానికి దిగుతుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.. ఉగ్రవాదులకు సంబంధించిన పలు స్థావరాలపై ఇప్పటికే భారత సైన్యం దాడులు జరిపింది. ఆ స్థావరాల పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు వ్యాపించడం వల్ల కొంతమంది ఉగ్రవాదులు సజీవ దహనం అయ్యారని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే దీనిని ఇంకా భారత సైన్యం ధ్రువీకరించలేదు.
