Jana Sena Alliance: నిన్నా మొన్ని టీడీపీ, జనసేన మధ్య పొత్తు విషయమై నెలకొన్న సస్పెన్స్ వీడింది. గతంలో రెండుసార్లు పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ అయినప్పుడు రెండు పార్టీలు కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఇరు పార్టీల నుంచి క్లారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు వేర్వేరుగా కలిసి వెళ్లాయనే ప్రచారం జరిగింది. కాగా, మూడోసారి చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల అధినాయకులు భేటీ అవడం రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రెండు పార్టీలు రాబోవు ఎన్నికల్లో కలిసి వెళ్లనున్నట్లు తేలిపోయింది. సీట్ల పంపకం ఎలా జరుగుతుందోనన్న ఆసక్తికర చర్చ మొదలైంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ స్వయంకృతాపరాధాలు, వైఫల్యాలపైనే దృష్టి పెట్టిన టీడీపీ, జనసేన ఆ మేరకు ప్రజల్లోకి తీసుకుళ్లేందుకు సఫలీకృతమయ్యారు. అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదు. దుబారాగా చేస్తున్న ఖర్చులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లోనూ వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దినసరి ఖర్చుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధికారం చేపట్టాల్సిన చారిత్రక అవసరం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
జనసేన కూడా అదే కోరుకుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకడదని పవన్ కల్యాణ్ మొదటి నుంచి అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొదటి, రెండుసార్ల భేటీలో పరామర్శలు జరిగాయి. విశాఖలో పవన్ కల్యాణ్ పై వైసీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతన్నారంటూ మండిపడ్డారు. ఇటు కుప్పంలోను చంద్రబాబుతో అలాంటి సంఘటనే జరిగింది. దీంతో వైసీపీని గద్దె దింపాలని నిర్ణయించుకున్న కారణాల్లో ఇదీ ఒకటిగా మారింది.
టీడీపీ, జనసేన కలుసుకోకూడదని వైసీపీ భావిస్తోంది. ఆ మేరకు ఢిల్లీ స్థాయిలో జగన్ చేసిన మంతనాలు ఫలించినట్లుగా కనబడటం లేదు. ఇటీవల చంద్రబాబు బీజేపీని ఆకాశానికెత్తుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబును ఎన్డీఏ ప్రభుత్వానికి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లుగా స్పష్టం అవుతుంది. అయితే, సీట్ల పంపకం విషయంలో రెండు పార్టీలు ఏకభిప్రాయాని వస్తే పొత్తు కథ ముగింపునకు చేరుకుంటుంది.
టీడీపీతో పొత్తు విషయంలో జనసేన 50 శాతం సీట్లుగాని 50 సీట్లు గాని అడుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకుని వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరికి కూడా ఒకటి రెండు సీట్లు కేటాయించున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఉన్న సీట్లలో మెజారిటీ భాగం టీడీపీకి ఉంచుకున్నా, జనసేనకు కేటాయించిన సీట్లు ప్రభత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయనేది స్పష్టమవుతుంది.