Homeజాతీయ వార్తలుMunugodu by-elections BJP : మునుగోడు ద్వారా ఏం ఆశించింది: బిజెపికి ఏం దక్కింది?

Munugodu by-elections BJP : మునుగోడు ద్వారా ఏం ఆశించింది: బిజెపికి ఏం దక్కింది?

Munugodu by-elections BJP : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉపఎన్నిక ద్వారా బిజెపి ఏం పొందాలనుకుంది? చివరికి ఏం దక్కింది? అంతగా నెత్తి మీదకు ఎందుకు తెచ్చిపెట్టుకుంది? దీనివల్ల పార్టీలోకి వలసలు ఉంటాయా? అసలు ఏ స్ట్రాటజీ ప్రకారం వలసలు ఉంటాయని భావిస్తోంది? కొద్దిగా ఈ విషయాలపై దృష్టి సారిస్తే.. అంతుబట్టని సమాధానాలు, అర్థం కాని అనేక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

-గెలుపు సంగతి తర్వాత..

మునుగోడు లో ఎవరు గెలుస్తారు? నిజానికి ఇది అసలు ప్రశ్న కాదు.. మునుగోడును బిజెపి ఎందుకు నెత్తి మీదకు తెచ్చిపెట్టుకుంది? ఇందులో ఏం లాభం ఆశించింది? ఈ పిచ్చి స్టాటజీలతో కేసీఆర్ ను ఢీకొట్టాలని భావిస్తుందా? అసలు భారతీయ జనతా పార్టీలో మనసుపెట్టి ఆలోచించే వారే లేకుండా పోయారా. మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. రకరకాల ఎగ్జిట్ పోల్స్ రకరకాల తీర్పులు ఇచ్చాయి.. వాటిల్లో అధిక శాతం ఏజెన్సీల పేర్లు ఎప్పుడూ వినలేదు.. అవి ఇచ్చే రిజల్ట్ కూడా పూర్తి బయాస్డ్ గా ఉన్నాయి. వీటి ప్రకారం టిఆర్ఎస్ భారీ తేడాతో బిజెపి మాడు పగలగొట్టబోతోంది.. అది నిజమైతేనే సుమా! అదే జరుగుతుందని ఓకే తెలుగు ఒక నిర్ధారణకు వచ్చి ప్రకటించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి అనిచ్చితం. ఇవే సంస్థలు దుబ్బాకలో బోల్తా కొట్టాయి. ఒకవేళ ఇదే నిజం అయితే గనక బిజెపి దిమ్మతిరిగిపోవడం మాత్రం ఖాయం.. వాస్తవానికి పోలింగ్ అయిదు గంటల తర్వాత చాలామంది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు వదిలేశారు..కానీ టర్న్ అయింది ఆ టైంలోనే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

-బిజెపి ఏం కోరుకున్నది.?

మునుగోడులో గెలవగానే దక్షిణ తెలంగాణలో రెడ్లు అందరూ బిజెపి ఆఫీస్ ఎదుట క్యూ కడతారని అనుకున్నదా? ఒక జాతీయ పార్టీ ఆలోచనల్లో ఇంత డొల్లతనం ఏమిటో అర్థం కావడం లేదు? రాష్ట్రంలో మజ్లీస్ సీట్లను వదిలేస్తే అసలు ఎన్ని సీట్లలో బిజెపికి అభ్యర్థులు ఉన్నారు? ఇది కదా అసలు జరగాల్సిన అంతర్మథనం? ఈ కదా అసలు జరగాల్సిన చర్చ? వాస్తవానికి పెద్ద పెద్ద నాయకులు పార్టీలో చేరితే పెద్దగా ఫాయిదా ఉండదు. ఏదో పత్రికల్లో, చానళ్ళల్లో ప్రసారం చేయడానికి తప్ప. వాస్తవానికి ఏ సీట్లలో ఎవరు బాగా వర్క్ చేస్తున్నారో అధ్యయనం కావాలి. భరోసా ఇవ్వాలి. పార్టీలోకి చేర్చుకోవాలి. కానీ ఎక్కడ ఈ దిశలో కసరత్తు జరగడం లేదు. రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరగానే పోలోమంటూ రెట్లు వచ్చేస్తారని ఎలా భావించింది బిజెపి? మరి ఇతర కులాల పరిస్థితి ఏమిటి? నాగం వంటి రెడ్లను బిజెపి ఎందుకు కాపాడుకోలేకపోతోంది? క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి తప్ప.. అర్జెంటుగా ఒక పెద్ద ఫిగర్ పార్టీలో చేరగానే కెసిఆర్ సర్కార్ కూలిపోయి బిజెపి సర్కార్ గద్దెనెక్కుతుందా? ఓవైపు కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నాడు.. ఆయన వాదనలో బొచ్చెడు లోపాలు.. అతనికి కూడా తెలుసు.. కానీ తన ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవారు బిజెపిలో ఎవరు?

-కదలిక ఏది?

గత 8 సంవత్సరాలుగా కాలేశ్వరం, కాకరకాయ అంటూ అరవడం తప్ప నిజమైన కదలిక బిజెపి నుంచి ఎక్కడ ఉన్నది? చివరకు కవిత ఇరుక్కుపోయింది అని భావిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కూడా చప్పబడిపోయింది.. చదివేందుకు ఇది కఠినంగా ఉన్నప్పటికీ హుజురాబాద్ లో గెలుపు కాంగ్రెస్ పూర్తిగా చేతులు ఎత్తడం వల్ల వచ్చింది. అదొక దుష్ట సమీకరణం అని ఇప్పటికీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. దుబ్బాకలో బిజెపి గెలుపునకు టిఆర్ఎస్ అభ్యర్థి కూడా ఒక కారణం. ఇవన్నీ చూసి కేసీఆర్ మునుగోడులో ఇటువంటి బందు పథకాలు గట్రా పెట్టదల్చుకోలేదు. ఏ డబ్బులతో అయితే కొట్టాలి అని బిజెపి అనుకున్నదో.. దానితోనే కెసిఆర్ సమాధానం చెప్పాడు. స్ట్రైట్ పోల్ మేనేజ్మెంట్… దెబ్బకు బిజెపి తలడిల్లిపోయింది. ఇక ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో జోకర్ క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్లో ఉండలేడు. అలాగని బయటపడలేడు. ఇక టిఆర్ఎస్ ఈ సెగ్మెంట్లో బీసీ ఓట్లను ఫర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంది. టిఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోయి కొన్ని ప్లాన్లు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో బిజెపి తెల్లమొహం వేసింది. ఇక ప్రధాన మీడియా సంగతి చెప్పాల్సిన పనిలేదు. అది కెసిఆర్ సంకలో పిల్లి.. ఇవన్నీ పక్కన పెడితే చివరి గంటల్లో జరిగిన పోలింగ్ ఆధారంగా బిజెపి గెలుస్తుంది అనుకుంటే ఆ పార్టీకి వచ్చే లాభం ఏమిటి? ఆఫ్ట్రాల్ మునుగోడు సీటు.. ఇదేమన్నా మా సిట్టింగ్ స్థానమా అనుకుని కెసిఆర్ లైట్ తీసుకుంటాడు. కనీసం ఈ విషయం పై బిజెపిలో అంతర్గతంగా చర్చకు వస్తుందా? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మునుగోడు గెలిస్తే మరో ఉపఎన్నిక.. డబ్బు ఖర్చు తప్ప పెద్దగా ఉపయోగం ఏముంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular