MLC Kavitha- ED: కవిత ఈడీ విచారణకు గైర్హాజరు వెనుక అసలు కథ ఇదీ

MLC Kavitha- ED: దేశాన్ని మొత్తం కుదిపేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఉదయం 11:30 నిమిషాలకు ఎమ్మెల్సీ కవిత ఈ డి అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమె మొన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకుంది. నిన్న ఢిల్లీలోని ఓ హోటల్లో మహిళా రిజర్వేషన్ కి సంబంధించి సమావేశం కూడా పెట్టింది. ఆ తర్వాత గురువారం ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తానని చెప్పింది. ప్రకారమే గురువారం ఉదయం […]

Written By: K.R, Updated On : March 16, 2023 4:44 pm
Follow us on

MLC Kavitha- ED

MLC Kavitha- ED: దేశాన్ని మొత్తం కుదిపేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఉదయం 11:30 నిమిషాలకు ఎమ్మెల్సీ కవిత ఈ డి అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమె మొన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకుంది. నిన్న ఢిల్లీలోని ఓ హోటల్లో మహిళా రిజర్వేషన్ కి సంబంధించి సమావేశం కూడా పెట్టింది. ఆ తర్వాత గురువారం ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తానని చెప్పింది. ప్రకారమే గురువారం ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ నిర్వహిస్తారని మీడియా ప్రతినిధులు భారీ ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. కానీ ఆమె ఎంతకీ హాజరు కాలేదు. చివరకు ప్రెస్ మీట్ రద్దయిందని భారత రాష్ట్ర సమితి నాయకులు తెలిపారు. అంతేకాదు ఆమె ఈడి విచారణ కూడా హాజరు కాలేదు. ఎందుకంటే తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సంబంధించి విచారణ పెండింగ్లో ఉన్నందున, హాజరు కాలేనని తన వ్యక్తిగత న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడి అధికారులకు సమాచారం పంపింది. దీనికి ఈడి అధికారులు ఒప్పుకోలేదు. మరోవైపు తనకు ఆరోగ్యం సరిగా లేదని మరో వర్తమానాన్ని తన లాయర్ ద్వారా ఈడి అధికారులకు చేరవేసింది. దీనిపై ఈడి అధికారులు సంతృప్తి చెందలేదు.

అందుకే రాలేదా?

మరో వైపు కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గురువారంతో ముగుస్తోంది. వాస్తవానికి ఈడి అధికారులు ఈరోజు కవితతో కలిసి గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై ని విచారించాలని అనుకున్నారు.. కానీ జరగబోయే పరిణామాన్ని ముందే పసికట్టిన కవిత.. విచారణకు సంబంధించి తనకు కొంచెం గడువు కావాలని నిన్న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురు కావడంతో గురువారం ఈ ప్లాన్ ను అమల్లో పెట్టింది. దీని వెనక కేటీఆర్, హరీష్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. కవిత విచారణకు రానందున గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గడువును పెంచుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరో వైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను రేపు ఈడీ విచారించనుంది.

MLC Kavitha- ED

కస్టడీ గడువు పెంపు?!

న్యాయ నిపుణులు చెప్పిన సమాచారం ప్రకారం.. గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ సమయాన్ని పెంచాలని ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో పెద్దపెద్ద వాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నందున.. అంత త్వరగా నిజాలు బయటికి రావని ఈడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో.. ఈ డి ఇలాంటి మినహాయింపులే కోరింది.. ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసు విషయంలో కూడా ఇదే విధానం అనుసరించే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థల అధికారులకు సహకరిస్తానని చెప్పిన కవిత.. ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడంపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత అక్రమాలకు పాల్పడిందని, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై తో కలిపి విచారణ లో పాల్గొంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయనే భయపడే విచారణకు హాజరు కాలేదని ధ్వజ మెత్తుతున్నాయి. కాగా కవిత విచారణకు హాజరుకాని నేపథ్యంలో ట్విట్టర్ లో ” ఢిల్లీ లిక్కర్ స్కాం” ట్రెండింగ్ గా నిలిచింది.

ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

కవిత విచారణకు హాజరు కానందున ఈడీ అధికారులు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసు ఇచ్చారు. ఇప్పటికే మాగుంట కుమారుడిని ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ లో మాగుంట, కవిత కీలకంగా ఉన్నారు. ఆయననుక్ కూడా విచారణకు పిలిపించి, కస్టడీ లోకి తీసుకోవాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

Tags