Ek Nath Shinde Uddhav Thackeray : ఠాక్రేపై తిరగబడ్డ షిండే కథ

Ek Nath Shinde Uddhav Thackeray మహారాష్ట్రలో శివసేన కూటమి చిక్కుల్లో పడింది. సొంత పార్టీ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో పార్టీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలకు శివసేన అల్టిమేటం జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని, రాని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరిక జారీ చేసింది. అయితే ఏక్ నాథ్ షిండ్ 22 ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంకు […]

Written By: NARESH, Updated On : June 23, 2022 10:44 am
Follow us on

Ek Nath Shinde Uddhav Thackeray మహారాష్ట్రలో శివసేన కూటమి చిక్కుల్లో పడింది. సొంత పార్టీ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో పార్టీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలకు శివసేన అల్టిమేటం జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని, రాని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరిక జారీ చేసింది. అయితే ఏక్ నాథ్ షిండ్ 22 ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంకు వెళ్లిపోయారు. బాల్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన ఏక్ నాథ్ షిండ్ ఎంతోకాలంగా శివసేనతో ఉంటున్నారు. ఆయన తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి..? అసలు రాజకీయ సంక్షోభం ఎక్కడ మొదలైంది..?

ఒకప్పుడు బీజేపీ, శివసేనలు మంచి మిత్ర పార్టీలు. అయితే గత పర్యాయం బీజేపీ అధికారంలో ఉండగా శివసేన కు నచ్చని పనులు చేసింది.అయినా కూడా గత ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి. బీజేపీకి 100కు పైగా వచ్చి శివసేనకు ఓ 60 వరకూ సీట్లు వచ్చాయి. అధికారంపై ఆశపడ్డ శివసేన బీజేపీతో కటీఫ్ చేసి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే శివసేన ప్రభుత్వం ఏర్పడడానికి ఏక్ నాథ్ షిండే కారణమని సమాచారం. ఒకప్పుడు బీజేపీలో మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఎన్డీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే ఆయన లక్ష్యమన్నట్టుగా రాజకీయం చేశారు.. ఇందులో భాగంగా ఆయన ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కొందరు ఎమ్మెల్యేలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు.

సీఎం గా ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలతో పాటు ఏక్ నాథ్ షిండే కూడా ఆదిత్య ఠాక్రేను వ్యతిరేకించారు. వీరి అలయన్స్ సమయంలో ఉద్దవ్ ఠాక్రేను సీఎంగా ప్రకటించారు. ఇదంతా ఏక్ నాథ్ షిండే వెనుకుండి నడిపించారని కొందరు చర్చించుకుంటారు. మొత్తానికి శివసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏక్ నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి శాఖను అప్పజెబుతూ మంత్రిని చేశారు.

అంతా బాగానే ఉన్నా ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే ప్రభుత్వంలోని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎక్కువైందని టాక్. ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్ నాథ్ షిండే ప్రమేయం లేకుండానే ముంబైలోని కొందరి ఇళ్లను కూల్చివేసినట్లు సమాచారం. కానీ బాధితులు మాత్రం షిండేపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆదిత్యఠాక్రే సీఎంవోను తన గుప్పెట్లో పెట్టుకొని తనకు అనుగుణంగా కొన్ని పనులు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.. కొన్ని నెలల కిందట బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ విషయంలోనూ ఆదిత్య ఠాక్రే ప్రమేయమే ఎక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రమేయం తగ్గుతుందని భావించిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో షిండే బీజేపీ వైపు వెళ్తారా..? లేక శివసేనను రెండుగా చీల్చుతారా..? అనేది ఉత్కంఠ రేపుతోంది.