https://oktelugu.com/

Janasena – Nagababu : జనసేనలో ఇక నాగబాబే నంబర్ 2 నా.. నాదెండ్లకు ప్రాధాన్యత తగ్గిందా? అసలు నిజం ఇదీ!

Janasena – Nagababu vs Nadendla : జనసేన.. జనంలోంచి వచ్చిన సేన.. పవన్ కళ్యాణ్ కష్టపడి పైకి తెచ్చిన పార్టీ. ఎవరో విరాళాలు ఇస్తారని ఆయన ఎదురుచూడలేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పార్టీలోకి పిలవలేదు. సామాన్యులకు పట్టం కట్టారు. సామాన్యులకే నాయకత్వపగ్గాలు అప్పజెప్పాడు. విద్యార్థి, యువతను లీడర్లను చేశాడు. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ నడుపుతున్నాడు. అయితే పవన్ సినిమాలతో బిజీగా ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం.. నిర్వహణ కష్టం అవుతోంది. దీంతో ఈ […]

Written By: NARESH, Updated On : April 15, 2023 1:32 pm
Follow us on

Janasena – Nagababu vs Nadendla : జనసేన.. జనంలోంచి వచ్చిన సేన.. పవన్ కళ్యాణ్ కష్టపడి పైకి తెచ్చిన పార్టీ. ఎవరో విరాళాలు ఇస్తారని ఆయన ఎదురుచూడలేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పార్టీలోకి పిలవలేదు. సామాన్యులకు పట్టం కట్టారు. సామాన్యులకే నాయకత్వపగ్గాలు అప్పజెప్పాడు. విద్యార్థి, యువతను లీడర్లను చేశాడు. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ నడుపుతున్నాడు.

అయితే పవన్ సినిమాలతో బిజీగా ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం.. నిర్వహణ కష్టం అవుతోంది. దీంతో ఈ బాధ్యతలను ఇన్నాళ్లు జనసేనలో నంబర్ 2గా పీఏసీ చైర్మన్ గా ఉంటున్న నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. ఆయన ఈ బాధ్యతలను చక్కగా ఓర్పుతో నేర్పుతోనే నిర్వహించారు. కానీ ఈ సువిశాఖ ఆంధ్రావనిలో అంత పెద్ద బాధ్యతలు ఇప్పుడు నాదెండ్లతో కావడం లేదు. అంతే కాకుండా క్షేత్రస్థాయిలోని సమస్యలు పవన్ కళ్యాణ్ వద్దకు చేరడం లేదు. నేతల సమన్వయ లోపం.. నాదెండ్ల బిజీ షెడ్యూల్ తో జనసైనికుల సమస్యలు మరుగనపడిపోతున్నాయి. దీంతో పార్టీని నమ్ముకొన్న వారికి అన్యాయం జరుగుతోందన్న వాదనను ఇటీవల ఏపీ సహా విదేశీ పర్యటనల్లో నాగబాబు గుర్తించారు. పవన్ కు రిపోర్టు చేశఆరు.

దీంతో ఇప్పటివరకూ జనసేనలో కేవలం రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్న నాగబాబుకు ప్రమోషన్ కల్పించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు అందలం దక్కింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే పవన్ తర్వాత నంబర్ 2 నాగబాబునే. దీంతో జనసేనలో నాగబాబు పాత్ర పెరగనుంది.

ఏ పార్టీకి అయినా ప్రధాన కార్యదర్శి అంటే అత్యంత కీలకం. పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ప్రధాన కార్యదర్శే. అధ్యక్షుడు అన్ని విషయాలు పట్టించుకోలేరు. రోజు వారీ వ్యవహారాలను చూసుకోలేరు. అందుకే పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి కీలకం.

ప్రస్తుతం పవన్ జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఆర్థిక సమస్యలు తీర్చేందుకు.. పార్టీ నిధులకోసం వరుస సినిమాలు ఒప్పుకొని షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు వీటిని కంప్లీట్ చేసి వారాహి యాత్ర చేసి ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

ప్రస్తుతం పవన్ స్థానంలో రాజకీయ వ్యవహారాలన్నీ నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. ఆయన ఒక్కరే కొంతకాలంగా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ రోజువారీ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో జనసైనికుల కష్టసుఖాలు, వారికి భరోసా కల్పించడంలో సమయం సరిపోవడం లేదు.

అందుకే నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన పవన్ జిల్లాల పర్యటనలకు పంపి పార్టీని బలోపేతం చేయడంతో పాటు జనసేన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించినట్టు సమాచారం.

నాగబాబుకు రాజకీయంగా పర్యటనలు చేయడం.. కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడంలో చాలా అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందు కూడా ఇలానే నాగబాబు అభిమానులతో సమావేశాలు నిర్వహించి వారిని పార్టీ ఏర్పాటు దిశగా సిద్ధం చేశారు. జనసేన విషయంలోనూ ఇప్పుడు అదే రోల్ ను నాగబాబు పోషించనున్నారు.

అయితే నాగబాబు నియామకం నాదెండ్ల మనోహర్ ను తగ్గించడం కాదన్న విషయం గుర్తించాలి. ఇప్పటికే నాదెండ్ల పని అయిపోయిందని చాలామంది సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి మెరుగుపరిచి నేతలు, కార్యకర్తలను సమన్వయపరిచేందుకే నాగబాబును ఈ కీలక పదవిలో పవన్ నియమించారని సమాచారం. పార్టీకి మేలు చేసేందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నాదెండ్లతోపాటు నాగబాబు కూడా యాక్టివ్ గా ఉంటే మంచిదని జనసైనికులకు ఇది గొప్ప భరోసా అని అంటున్నారు.