Congress : తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయి. ఇన్నాళ్లు తొడగొట్టిన బండి సంజయ్ ను బీజేపీ తీసివేయడం.. గతంలో కిషన్ రెడ్డి సారథ్యంలోనే బీజేపీ కేవలం 1 సీటు సాధించి ఘోరంగా ఓడిపోవడం.. ఇప్పుడు ఆయననే తెలంగాణ బీజేపీ చీఫ్ ను చేయడంతో కాంగ్రెస్ కు తిరుగులేకుండా పరిస్థితి తయారైంది. అధికార బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లు పోటీలో ఉన్న బీజేపీ కూడా నాయకత్వ లోపంతో కుదేలు కావడంతో ఇక కాంగ్రెస్ కు లైన్ క్లియర్ అయ్యింది.
తాజాగా సర్వే సంస్థలు బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ కు దూరమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ వారికి ఆశాజ్యోతిగా కనిపిస్తోంది. భట్టి పాదయాత్రలో ఇదే స్పష్టం అయింది. ఎన్నికల వేళ దీనిని మరింత బలోపేతం చేసుకొనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.
కేసీఆర్, రెండో విడత ప్రభుత్వంలో మాత్రం వైఫల్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీల గెలుపు ఓటమలును నిర్దేశించే ప్రధాన ఓటింగ్ వర్గాలు బీఆర్ఎస్ కు పూర్తిగా దూరమయ్యాయి. ఈ సమయంలో బీజేపీ ఏ మాత్రం పోటీలో లేకుండా పోయింది. తొలి నుంచి పేదల పార్టీగా..అణగారిన బహుజన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా కాంగ్రెస్ కు ఇప్పుడు తెలంగాణలో ఆదరణ పెరిగింది. తాజాగా మారుతున్న సమీకరణాల్లో ఇదే విషయం స్పష్టం అవుతోంది. నిరుద్యోగులు ప్రభుత్వం పైన రగిలి పోతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
సీఎల్పీ నేత భట్టి నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చేసింది. రాహుల్ గాంధీ, భట్టి హామీలు కలిసివస్తున్నాయి. కాంగ్రెస్ తోనే తామంతా అంటూ ఆ వర్గాలు హామీ ఇచ్చాయి. తాజాగా రాహుల్ గాంధీతో భట్టి సమావేశ సమయంలోనూ ఇవే అంశాలు చర్చించారు. ఫలితంగా ఈ వర్గాల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు బీఆర్ఎస్ ను నమ్మి మోసపోయిన వారికి కాంగ్రెస్ దిక్సూచీగా మారుతోంది. కాంగ్రెస్ ను అదే గెలిపించబోతోంది. బీఆర్ఎస్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది.