Pawan Kalyan CM: పవన్ ని సీఎం చేయడానికి రంగం సిద్ధం

Pawan Kalyan CM: విశాఖ లొల్లి జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కలిసి వచ్చే పరిణామంగా మారింది. విశాఖలో వైసీపీ సర్కార్ పవన్ ను నిర్బంధించడంతో ఆయనపై ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో సానుభూతి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి కలిసి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జనసేనకు లాభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వైసీపీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షాలైన చంద్రబాబు, […]

Written By: NARESH, Updated On : October 19, 2022 2:49 pm
Follow us on

Pawan Kalyan CM: విశాఖ లొల్లి జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కలిసి వచ్చే పరిణామంగా మారింది. విశాఖలో వైసీపీ సర్కార్ పవన్ ను నిర్బంధించడంతో ఆయనపై ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో సానుభూతి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి కలిసి మద్దతు ప్రకటించారు.

Pawan Kalyan CM

ఈ పరిణామం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జనసేనకు లాభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వైసీపీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షాలైన చంద్రబాబు, పవన్ లు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదంటే వీరిద్దరూ ఒక్కటి కావాలి. విశాఖలో పవన్ నిర్బంధాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి పవన్ కు మద్దతు పలకడం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనానికి దారితీసింది.

జగన్ ను ఓడించడానికి చంద్రబాబు-పవన్ లు విడివిడిగా పోటీచేసినా.. కలిసి సాగినా కానీ గెలుపు ఖాయం.. ఈ ఇద్దరూ కలిస్తే జగన్ వైసీపీ గెలుపు కష్టమే. ఇప్పటికే పాలనతో బోలెడంత వ్యతిరేకత సంపాదించుకున్న జగన్ కు చంద్రబాబు, పవన్ లు కలవకూడదని ఉంది. అయితే నిన్న భేటితో వైసీపీలో వణుకు మొదలైందనే చెప్పాలి.

Pawan Kalyan CM

అయితే పవన్ మాత్రం ఏపీలో మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలనే చూస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామి ఎలాగైతే పోటీచేసి 40కి పైగా సీట్లు సాధించాడో అలాగే ఏపీలో పవన్ చేయాలని చూస్తున్నాడు. నాడు బీజేపీని ఓడించడానికి కుమారస్వామిని కాంగ్రెస్ సీఎంను చేసింది. ఇప్పుడు ఇదే ఏపీలో హంగ్ వస్తే.. జగన్ కు మెజార్టీ రాకపోతే ఖచ్చితంగా జనసేనకు టీడీపీ మద్దతు ఇస్తుంది. పవన్ ను సీఎంగా చేయడం తప్ప చంద్రబాబు మరో ఆప్షన్ ఉండదు. ఇప్పటికే సీఎంగా చేసిన చంద్రబాబు తన పదవిని త్యాగం చేసి అయినా జగన్ ను గద్దెదించడానికి ఈ చొరవ తీసుకోవచ్చు. ఎందుకంటే నిన్న కూడా పవన్ ను కలవడానికి ఆయనే చొరవ తీసుకున్నాడు.

సో జనసేనాని ఒంటరిపోరు సలిపినా.. ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కానీ వైసీపీ వ్యతిరేకతనే ఆయనకు బలం.. వచ్చేసారి సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Tags