Telangana Holidays 2023: తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం (2023)లో సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే వచ్చే సంవత్సరానికి కూడా సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణ, ఐచ్ఛిక సెలవులతో కలిపి 28 రోజులు సాధారణ సెలవులుగా 24 రోజులు ఐచ్ఛిక సెలవులుగా ఇస్తూ నిర్దేశించింది. దీంతో రాష్ర్ట ప్రభుత్వం ఆదివారం, రెండో శనివారాలు కలిపి సెలవులను ఇవ్వడం మామూలే. ఈ నేపథ్యంలో 52 రోజులు సెలవులుగా ఇచ్చింది.

తాజాగా విడుదల చేసిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రూపొందించింది. నూతన సంవత్సరం ఆదివారం వచ్చింది. భోగి పండుగ రెండో శనివారం, సంక్రాంతి ఆదివారం రోజు రావడం గమనార్హం. దీపావళి పర్వదినం సైతం ఆదివారం రోజే వచ్చింది. సద్దుల బతుకమ్మ కూడా అక్టోబర్ 10 సెలవు రోజు రావడం తెలిసిందే. విజయదశమి అక్టోబర్ 24న, దీపావళి నవంబర్ 12న వచ్చాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పండుగలు రానున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో ఐదు ఐచ్ఛిక సెలవులు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈదుల్ మిలాద్ పండుగల తేదీల్లో మార్పులుంటాయని తెలుస్తోంది. హిందువుల పండుగల్లో సంక్రాంతి, దసరా, దీపావళి, సద్దుల బతుకమ్మ పండుగలు ఆదివారాలు రావడంతో సెలవులు గల్లంతయ్యాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 16 రోజులు సెలవులు రావడం గమనార్హం. ఏప్రిల్ లో ( 5 జనరల్+5ఆప్షనల్+1 రెండో శనివారం, 5 ఆదివారాలు ) ఉన్నాయి. ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 22న రంజాన్, ఏప్రిల్ 23న రంజాన్ మర్నాడు సందర్భంగా జనరల్ సెలవులు మంజూరు చేసింది. పండుగలైన భోగి, సంక్రాంతి, దీపావళి, రంజాన్ రెండో శనివారం, ఆదివారాలు వచ్చాయి.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోసియబుల్ ఇనస్ట్ర్రమెంట్ యాక్ట్ ) 23గా నిర్ధారిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఏడాది సెలవులు బాగా ఉండటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు కూడా ఆదివారాలు రావడంతో కొన్ని రోజులు అందులో కలిసిపోయాయి. మొత్తానికి ఉద్యోగులకు కోరికలకు అనుగుణంగానే సెలవులు రావడం గమనించదగిన విషయమే. ఈ నేపథ్యంలో వచ్చే సెలవుల క్యాలెండర్ విడుదల చేసింది.