TANA
TANA: తానా ప్రతినిధులు మిషిగాన్‌లో జూలై 3 నుంచి 5 వరకు నిర్వహించే మహా సభలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. మరోవైపు వేడుకలు పలువురు అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu)ను తానా మహా సభలకు ఆహ్వానించారు. తాజాగా ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్రమంత్రులు(Central Ministers), ఎంపీలను కలిశారు. జూలై 3 నుంచి 5 వరకు మిషిగాన్‌లోని నోవైలో జరగనున్న 24వ మహాసభలకు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani ChandraShekar), భూపతిరాజు శ్రీనివాసవర్మ(Bhupathiraju Srinivas varma), రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)లతోపాటు ఎంపీలు కేశినేని చిన్ని, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేశ్, లావు కృష్ణ దేవరాయలను స్వయంగా కలిసిన తానా నాయకులు, వారిని మహాసభలకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన కేంద్రమంత్రులు, ఎంపీలు తాము హాజరవుతామని హామీ ఇచ్చినట్లు తానా ప్రతినిధులు తెలిపారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, పాతూరి నాగభూషణం, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి వంటి ప్రముఖులు ఈ బృందంలో ఉన్నారు.
TANA (2)
సభల గురించి వివరించి..
ఇదిలా ఉంటే.. తానా సమావేశాలు, నిర్వహించే కార్యక్రమాలు, సమావేశం ఎజెండా తదితర వివరాలను కూడా ప్రతినిధులు కేంద్ర మంత్రులు, ఎంపీలకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. తెలుగు సంఘం ద్వారా సామాజిక సేవలో తమ సంస్థ చేస్తున్న కృషిని హైలైట్ చేస్తూ, ఈ కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులను తీసుకొస్తున్నాయని వారు పేర్కొన్నారు.
TANA (3)
ఏర్పాట్లు వేగవంతం..
ఇదిలా ఉంటే.. కాన్ఫరెన్స్ కన్వీనర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు డెట్రాయిట్‌లో జరగనున్న మహాసభల కోసం ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన సన్నాహాలను పర్యవేక్షిస్తూ, పలువురితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలు తెలుగు సమాజానికి చెందిన వివిధ వర్గాలను ఒకచోట చేర్చి, సాంస్కృతిక, సామాజిక అంశాలపై చర్చలకు వేదికగా నిలవనున్నాయి.
TANA (4)
దశాబ్దాలుగా సేవలు..
తానా సంస్థ దశాబ్దాలుగా తెలుగు సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఈ మహాసభలు కేవలం ఒక సమావేశం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేసే వేదికగా ఉపయోగపడతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల సమక్షంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, సామాజిక సేవలపై విస్తత చర్చలు జరిగే అవకాశం ఉంది.
TANA (5)
TANA (6)
TANA (7)
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Tana tana representatives meet union ministers and mps in delhi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com