Site icon OkTelugu

Supreme Court Shock for Mamata: మమతకు సుప్రీం షాక్‌.. అన్నిదారులు మూసుకుపాయె!

Supreme Court Shock for Mamata

Supreme Court Shock for Mamata

Supreme Court Shock for Mamata: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు ఈసారి ప్రత్యేకంగా నిలిచాయి. మొదటి విడత 93 శాతం పోలింగ్, రెండో విడత 92 శాతం పోలింగ్‌ జరిగి చరిత్ర సృష్టించింది. పెరిగిన పోలింగ్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి బెంగాల్‌లో ప్రభుత్వం మారుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. బీజేపీ అధికారంలోకి వస్తుందని 90 శాతం ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి. ఈ క్రమంలో నాలుగోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న మమతా బెనర్జీ కౌంటింగ్‌పైనా సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీంలో కూడా ఆమెకు చుక్కెదురైంది. కేంద్ర ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించడాన్ని మమతా బెనర్జీ సవాల్‌ చేశారు. కానీ సుప్రీం కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ‘ప్రభుత్వ సిబ్బంది విధేయతలు లేకుండా పనిచేస్తారు. ఎన్నికల సంఘం (ఈసీ)కి పూర్తి అధికారం ఉంది. రాజకీయ పార్టీల సలహా అవసరం లేదు’అంటూ కోర్టు స్పష్టం చేసింది.

టీఎంసీ ఆరోపణలు ఇవీ..
రాష్ట్ర ఉద్యోగులను కౌంటింగ్‌ సూపర్వైజర్ల స్థానం నుంచి తొలగించి కేంద్ర సిబ్బందిని పెట్టారని టీఎంసీ ఆరోపించింది. ఈసీ దాన్ని తిరస్కరించి, రెండు రకాల ఉద్యోగులు కొనసాగుతారని తెలిపింది. రెండో విడత పోలింగ్‌ తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలతో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ధర్నా చేసిన మమతా బెనర్జీ తీరును, ట్యాంపరింగ్‌ ఆరోపణలను ఈసీ ఖండించింది.

శాంతియుత పోలింగ్‌..
పశ్చిమ బెంగాల్‌లో ఈసారి రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రికార్డుస్థాయిలో పోలింగ్‌ జరిగింది. చెదురుముదురు ఘటనలు మినహా హింస లేకుండా పూర్తయ్యాయి. మే 4న ఫలితాలు. టీఎంసీ ఆరోపణలు ఈ వాతావరణాన్ని దెబ్బతీశాయి.

తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఎన్నికల సంఘానికి స్వేచ్ఛను బలపరిచింది. కేంద్ర–రాష్ట్ర సిబ్బంది మిక్స్‌తో నిష్పక్షత పెరుగుతుంది. టీఎంసీ భయాలు ఊహాజనితాలు. అధికార పార్టీగా ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ఓడిపోయినా సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారు.

Exit mobile version