https://oktelugu.com/

బల్లికి భయపడ్డ షర్మిల.. వీడియో వైరల్

జగనన్న వదిలిన బాణం ఆమె.. అన్న జైలుకు వెళ్లినా పార్టీని కాపాడి పాదయాత్రతో చేరువైన ధీర వనిత.. చంద్రబాబు, లోకేష్ లను అధికారంలో ఉండగానే పప్పూ అంటూ తిట్టిపోసిన ధీరోధాత్తురాలు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఒంటరిగా వచ్చిన మహిళ. వస్తూనే బలమైన కేసీఆర్, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసి సవాల్ చేసిన స్త్రీమూర్తి. అలాంటి వైఎస్ షర్మిల సిల్లీగా ఒక బల్లికి భయపడింది. భయంతో కేకలు వేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైఎస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 11, 2021 / 08:31 PM IST
    Follow us on

    జగనన్న వదిలిన బాణం ఆమె.. అన్న జైలుకు వెళ్లినా పార్టీని కాపాడి పాదయాత్రతో చేరువైన ధీర వనిత.. చంద్రబాబు, లోకేష్ లను అధికారంలో ఉండగానే పప్పూ అంటూ తిట్టిపోసిన ధీరోధాత్తురాలు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఒంటరిగా వచ్చిన మహిళ. వస్తూనే బలమైన కేసీఆర్, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసి సవాల్ చేసిన స్త్రీమూర్తి. అలాంటి వైఎస్ షర్మిల సిల్లీగా ఒక బల్లికి భయపడింది. భయంతో కేకలు వేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    వైఎస్ షర్మిల భయంతో కేకలు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. కప్పి ఉంచిన ధాన్యాన్ని పరిశీలిస్తూ మీద కవర్ తీసిన షర్మిల అందులో ఏదో కదులుతూ కనిపించింది. దీంతో కెవ్వు మని అరిచి రెండు చెవులు మూసుకుంది.

    షర్మిల అరుపులకు వెంటనే గన్ మెన్లు వచ్చి చూడగా అది బల్లి.. కిందపడి పారిపోయింది. బల్లికి భయపడిన షర్మిల అని మీడియాలో హెడ్ లైన్లతో హోరెత్తించారు.

    రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉన్నా ఎవరికైనా వ్యక్తిగత భయాలుంటాయి. కొందరికి పాము, మరికొదందరికీ బల్లులు, తేల్లు, దెయ్యాలంటే భయం.. ఇలా అందరినీ ఢీకొట్టే షర్మిల చిన్న ప్రాణి బల్లికి భయపడడం చోద్యమే మరీ..