Russia Ukraine War: యుద్ధం అంటే అంత ఈజీ కాదు. అది ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బాగా తెలిసి వస్తోంది. గత ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న పుతిన్.. ఇప్పటికీ సాధించింది ఏమీ లేదు. పైగా అటు నాటో దేశాల సహకారం లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పుతిన్ యుద్ధానికి గురువారం, శుక్రవారం ( జనవరి 6, 7) విరామం ప్రకటించాడు. కానీ అవి సాకులు మాత్రమే. కానీ యుద్దాన్ని పూర్తిగా అపే పని ఎవరూ చేయడం లేదు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు.. కానీ దాని సారాంశం ఏమిటో ఎవరికీ తెలియదు. బయట ఏవేవో ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి కానీ. అవేవీ నిజాలు కాదు.

సత్తా లేదు..
ప్రస్తుతం రష్యా వద్ద ఆధునిక యుద్ద పరికరాలు ఉన్నాయి. వాటిని వాడగల సైనికులు మాత్రం లేరు. ఇంజనీర్లు అంతకన్నా లేరు.. అందు కోసమే పుతిన్ రెండు రోజులపాటు యుద్ధ విరామం ప్రకటించారని ఓ పత్రిక సంచలన విషయాలు ప్రకటించింది.. దీనిని అప్పట్లో అందరూ తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు అవి నిజాలు అయ్యాయి. రష్యాకు ఆర్టీలరీ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో ఉక్రెయిన్ పై యుద్ధం లో సులువుగా విజయం సాధించవచ్చు.. కానీ వీటిని సమర్థవంతంగా ఆపరేట్ చేసేవారు లేరు..
ఏదో నెట్టుకొచ్చింది
ఇక “దొనెత్సక్ పీపుల్ రిపబ్లిక్” అనే ప్రాంతం భౌగోళికంగా ఉక్రెయిన్ లోనే ఉన్నా ఈ ప్రాంతం మొత్తం రష్యన్ భాష మాట్లాడే వాళ్ళతో నిండి ఉంది.. పైగా రష్యాకు అనుకూలంగా గత పది సంవత్సరాలుగా పోరాడుతోంది.. ఇక ఈ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది.. ఇక రష్యా వద్ద ఉన్న ఆర్టీలరీ గన్స్ మీద ఆ దేశ సైనికులకు 20% మాత్రమే తెలుసు. హోవిట్జర్లు, రాకెట్ లాంచర్స్, డ్రోన్లు, ఫైర్ కంట్రోల్ సిస్టం ఒక దానికి ఒకటి అనుసంధానంగా పనిచేయలేకపోవడం వల్ల యుద్ధంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతోంది.. అంతేకాదు ఫార్వర్డ్ అబ్జర్వర్ అనేవి ఆర్మీకి కళ్ళు,చెవులు లాంటివి. ఒకప్పుడు వీటి కోసం మనుషులను వాడేవాళ్లు. ఇప్పుడు చిన్న చిన్న డ్రోన్లు వాడుతున్నారు. యూఏవీ లను కూడా ఉపయోగిస్తున్నారు.

ఫిబ్రవరి 24న..
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పుడు ఆర్టిలరీ గన్స్ ఫ్రంట్ లైన్ లో ఉన్నాయి.. ఫైర్ కంట్రోల్ సిస్టం కూడా తన వంతు పనిచేసింది..డ్రోన్లు కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. కానీ సకాలంలో ఆర్టిలర్ గన్స్ కు సకాలంలో సమాచారం ఇవ్వలేదు.. దీంతో రష్యాకు యుద్ధం గెలిచే అవకాశం రాలేదు. ఇప్పటికీ ఎటువంటి అనుసంధానం లేకుండానే యుద్ధం చేస్తోంది.. అక్కడ ఉక్రెయిన్ ఉంది కాబట్టి సరి పోయింది.. మరో దేశం కనుక ఆ స్థానంలో ఉంటే రష్యా కు సరిపోయేది. ఇప్పుడు ఇదే విషయం పుతిన్ కు తెలిసి వస్తోంది. ఇప్పుడు రెండు రోజులు మాత్రమే యుద్దాన్ని తాత్కాలికంగా ఆపాడు.. కానీ తర్వాత రోజుల్లో పూర్తిగా నిలిపివేస్తాడు. అది కూడా దగ్గరలోనే ఉంది.