https://oktelugu.com/

Pawan Chandrababu Meeting: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటి.. ఇక అధికారం వీరిదే.. జగన్ కు షాక్ లగా?

Pawan Chandrababu Meeting: ఎవరు కలవద్దు అని అనుకున్నారో వారే కలిసారు..సారీ సారీ.. కలిపాడు మన జగనన్న.. నిజంగానే తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి రాజకీయం వాళ్లు చేసేవారు. కేంద్రంలోని బీజేపీ ఇటు వైసీపీతో ఢిల్లీలో దోస్తీ చేసేది.. గల్లీలో ఫైట్ చేసేది. పవన్ కళ్యాణ్ ను దూరం నుంచి గమనిస్తూ ఉండేది. ఇక ప్రతిపక్ష టీడీపీ ‘మహానాడు’ ఉత్సాహంతో ఇక తమకు తిరుగులేదని.. జనసేనను […]

Written By: NARESH, Updated On : October 18, 2022 4:21 pm
Follow us on

Pawan Chandrababu Meeting: ఎవరు కలవద్దు అని అనుకున్నారో వారే కలిసారు..సారీ సారీ.. కలిపాడు మన జగనన్న.. నిజంగానే తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి రాజకీయం వాళ్లు చేసేవారు. కేంద్రంలోని బీజేపీ ఇటు వైసీపీతో ఢిల్లీలో దోస్తీ చేసేది.. గల్లీలో ఫైట్ చేసేది. పవన్ కళ్యాణ్ ను దూరం నుంచి గమనిస్తూ ఉండేది.

ఇక ప్రతిపక్ష టీడీపీ ‘మహానాడు’ ఉత్సాహంతో ఇక తమకు తిరుగులేదని.. జనసేనను పట్టించుకోవడం మానేసింది. తిక్కరేగిన పవన్ జనాల్లోకి వెళుతూ ‘జనవాణి’ అంటూ.. కౌలురైతులకు రూ.5 లక్షల చొప్పున సేవా వితరణ చేస్తూ.. వైసీపీ అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తూ ప్రజల్లో పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు విశాఖ ఎపిసోడ్ తో పవన్ నిజంగానే రాజకీయాల్లో హీరో అయిపోయాడు. జగన్ రౌడీ రాజ్యాన్ని ఎదిరించే నేతగా నిలబడ్డారు. అందుకే ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కదిలివచ్చారు.

తెలుగు రాజకీయాల్లోనే సంచలన భేటికి పురుడు పడింది. ఏదైతే వైసీపీ కావద్దు అని భావించిందో అదే జరిగింది. ప్రతిపక్షాలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటయ్యాయి. నిన్న పవన్ ను సోము వీర్రాజు కలిసి సానుభూతి మద్దతు తెలిపితే.. ఈరోజు ఏకంగా 40 ఇయర్స్ చంద్రబాబు వచ్చి మరీ పవన్ కళ్యాణ్ ను కలిశారు. జగన్ చర్యలతో ఒళ్లు మండిన పవన్ ఆ పార్టీపై యుద్ధం ప్రకటించిన రోజే ఈ భేటి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జగన్, వైసీపీ సర్కార్ చర్యల ఫలితంగానే ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం, జనసేన ఒక్కటి కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబును ఏడిపించిన జగన్.. నిన్న విశాఖ సాక్షిగా పవన్ ను ఇబ్బంది పెట్టారు. అందుకే ఈ బాధితులు ఇద్దరూ కలిసి జగన్ పని పట్టడానికి రెడీ అయ్యారు.

తన భేషజాలన్నీ మరిచి జగన్ ను గద్దెదించడమే ధ్యేయంగా పెద్ద మనిషి చంద్రబాబు ఒక మెట్టు దిగి మరీ పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. స్వయంగా విజయవాడ నోవాటెల్ హోటల్కు వచ్చి మరీ పవన్ ను కలిసి చర్చించారు. విశాఖ ఘటనపై పవన్ ను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు, పవన్ ల భేటి ఏపీలో రాజకీయ వేడి పుట్టించింది. అధికార వైసీపీ గుండెలు అదిరిపోయేలా చేసింది. కొద్దిసేపటి క్రితమే వైసీపీ నేతలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు పవన్. ఆ వెంటనే చంద్రబాబు వచ్చి కలవడంతో ఇక పవన్ కు కొండంత ధైర్యం వచ్చినట్టు అయ్యింది.

వీరిద్దరూ కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏపీలో రాజ్యాధికారం ఈజీ అవుతుంది. వైసీపీ వీరిద్దరిని కలవవద్దని ఎంత ప్రయత్నించినా చివరకు జగన్ చర్యలతోనే వీరిద్దరూ కలవడం విశేషం. తన గొయ్యి తానే తీసుకున్న చందంగా జగన్ చర్యలే ఇప్పుడు ఇద్దరు ఆయన శత్రువులను ఏకం చేసింది. ఇది జగన్ సీఎం సీటుకే ఎసరు తేవడం ఖాయం.. రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమన్నది నిర్విదాంశం. ఈ గొప్ప పొత్తుకు బాటలు వేసింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబే అని చెప్పాలి. అధికారం కోసం ఎంతకైనా తెగించే బాబు గారు ఇప్పుడు పవన్ ను కలుపుకుపోయే స్టెప్ మాత్రం ఏపీ రాజకీయాలను మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.