NFHS Survey: దేశంలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఎఫైర్లు.. ఒక్కొక్కరికి ఎంతమందితో అంటే?

NFHS Survey: ‘మహిళ తిరిగి చెడితే.. మగాడు తిరగకపోతే చెడిపోతాడని’ ఒక సామెత ఉంది. కానీ ఇప్పుడు ఇది అక్షరాల నిజమైంది. దేశంలో మగాళ్ల కంటే ఆడవారే ఎక్కువ శృంగార అనుభవాన్ని సంపాదిస్తున్నారు. ఒకరి కంటే ఒకరి కంటే ఎక్కువ మందితో ఆ శృంగార అనుభవాన్ని పొందుతున్నారు. ఇదేదో మేం చెప్పే లెక్కలు ఎంత మాత్రం కాదు.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిగ్గుతేల్చిన పచ్చినిజం. అవును దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ […]

Written By: NARESH, Updated On : August 19, 2022 9:56 pm
Follow us on

NFHS Survey: ‘మహిళ తిరిగి చెడితే.. మగాడు తిరగకపోతే చెడిపోతాడని’ ఒక సామెత ఉంది. కానీ ఇప్పుడు ఇది అక్షరాల నిజమైంది. దేశంలో మగాళ్ల కంటే ఆడవారే ఎక్కువ శృంగార అనుభవాన్ని సంపాదిస్తున్నారు. ఒకరి కంటే ఒకరి కంటే ఎక్కువ మందితో ఆ శృంగార అనుభవాన్ని పొందుతున్నారు. ఇదేదో మేం చెప్పే లెక్కలు ఎంత మాత్రం కాదు.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిగ్గుతేల్చిన పచ్చినిజం. అవును దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు ఉన్నాయని తేలింది. పురుషులు ఒకరు లేదా ఇద్దరి మహిళలతో మాత్రమే శృంగారాన్ని అనుభవిస్తే.. మహిళల్లోనే అధిక లైంగిక భాగస్వాములు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బాంబు పేల్చింది.

విదేశాలతో పోలిస్తే భారత్ లో మహిళలు పద్ధతిగానే ఉంటారు. కానీ ఆధునిక కల్చర్ కు అందరూ అలవాటు పడిపోతున్నారు. కన్యత్వం, శీలత్వం అన్న మూస ధోరణులకు స్వస్తి పలుకుతున్నారు. ఇష్టమైతే శృంగారానికి వెనుకాడడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఏ సంబంధం లేని ఇద్దరు ఇష్టపడి శృంగారానికి పాల్పడితే తప్పు కాదని తేలింది. విదేశాల్లో డేటింగ్ లు, ఎంజాయ్ విడిపోవడాలు ఎక్కువైనట్టే.. దేశంలో వివాహితులైన స్త్రీలు ఇతరులతో కమిట్ అవ్వడం కూడా ఎక్కువైందని తేలింది. సాధారణంగా పురుషులకు ఈ ఎఫైర్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ రాష్ట్రాల్లో పురుషులను మించి మహిళలకు ఎక్కువ మందితో శృంగార అనుభవాలు పొందారని తేలింది..

కరోనా లాక్ డౌన్ వేళ ఒకరు, ఇద్దరిని మెయింటేన్ చేసే మగాళ్ల గుట్టు రట్టు అయ్యింది. లాక్ డౌన్ లో ఒక ఇంట్లోనే ఉండడంతో రెండో ఇంటి వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. అయితే దేశంలో మహిళలు కూడా తక్కువ కాదని తేలింది. మన సంప్రదాయాలన్నీ పక్కనపెట్టి లైంగిక ఆనందాన్ని ఇతరులతో పొందుతూ పంచుకుంటున్నారని తేలింది.

దేశంలో స్త్రీ, పురుషుల లైంగిక జీవనానికి సంబంధించి విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పెనుదుమారం రేపింది. సాధారణంగా పురుషులకు వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉంటాయి., కానీ కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్త్రీలకే ఎక్కువ మందితో శృంగారం చేశారన్న విషయం బయటపడింది.

2019-21 సంవత్సరాల మధ్య కేంద్రం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులు, స్త్రీల లైంగిక సంబంధాలపై ఈ సర్వే చేసింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలున్నాయని తేలింది.

-రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అసోం,లక్షదీప్ , పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీలు తమ జీవితకాలంలో అధిక మంది పురుషులతో శృంగారం చేసినట్టు ఒప్పుకున్నారు.

-రాజస్థాన్ లో దేశంలోనే అత్యధికంగా ఒక స్త్రీ 3.1 మందితో శృంగారం చేసింది. ఈ రాష్ట్రంలో పురుషులు 1.8 మంది మహిళలతో మాత్రమే శృంగార అనుభవాన్ని పొందాడు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఈ శృంగార ఎఫైర్లు ఎక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది.

-దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది స్త్రీలు, లక్ష మంది పురుషులపై సర్వే చేశారు.

-ఏపీలో ఒకరి కంటే ఎక్కువమందితో శృంగార లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీలు 0.1 శాతం మంది మాత్రమే ఉన్నారు. పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో స్త్రీలు 0.4 శాతంగా ఉండగా.. పురుషుల్లో 2.1 శాతంగా ఉంది.

దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే పలు రాష్ట్రాల్లో మహిళలు.. పురుషుల కంటే ఎక్కువగా లైంగిక సంబంధాలను కలిగి ఉన్నారని తేలింది. ఆధునిక జీవనశైలి కారణంగా ఈ ఎఫైర్లు ఎక్కువగా అవుతున్నట్టే తేల్చింది.