Nagarjuna Narayana: సినిమా తొలి షో పడ్డాక అది హిట్టా? ఫ్లాపా? అని తెలియాలంటే ప్రధానంగా మనకు కావాల్సినవి ‘రివ్యూలు’. ఇప్పటికీ ఈ రివ్యూలు చూసి 3 పైన రేటింగ్ ఉంటేనే జనాలు , సినీ ప్రముఖులు థియేటర్ కు వస్తున్నారు. ఫ్లాప్ అని తేలితే రెండో రోజు నుంచే ఆ సినిమా థియేటర్ వెలవెలబోతోంది. అంతలా రివ్యూలు ప్రభావితం చేస్తున్నాయి.

ఒక సినిమా బాగుంటే రివ్యూలే అద్భుతం అని కొనియాడుతాయి. బాగా లేకుంటే ముఖం మీదే చెప్తాయి. వెబ్ సిరీస్ లు, మూవీల రివ్యూలను చూసే చాలా మంది వాటిని చూస్తారు. హీరో నాగార్జున కూడా అదే పనిచేస్తాడట.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తానని.. కనీసం వెయ్యి రివ్యూలు , 7 రేటింగ్ ఉంటే అప్పుడు ఆ సినిమా చూస్తానని.. లేదంటే టైమ్ వేస్ట్ కదా? అంటూ పేర్కొన్నాడు. ‘బ్రహ్మస్త్ర’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఇక బిగ్ బాస్ లో ఇటీవల ‘నారాయణ.. నారాయణ’ అంటూ సీపీఐ నారాయణను ఎద్దేవా చేస్తూ నాగార్జున మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ లోని భార్యభర్తలు ముద్దులు, హగ్గులు పెట్టుకుంటే.. ‘నారాయణ నారాయణ.. వాళ్లు కపుల్స్’ అంటూ నాగార్జున సెటైర్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే షోలో తాను ‘నారాయణ నారాయణ’ అని సరదాగా అన్నానని.. అది ఎవరికీ కౌంటర్ కాదని నాగార్జున వివరణ ఇచ్చాడు. గత రెండు సీజన్లలోనూ నేను ‘నారాయణ ’ అని అన్నానని నాగార్జున వివరణ ఇచ్చాడు. అంతే తప్ప ఇది ఎవరినీ ఉద్దేశించి అన్నది కాదని.. స్పష్టం చేశారు.
ఇక బిగ్ బాస్ లో భిన్న మనస్థత్వాలను అధ్యయనం చేయడం.. వారి మనసులు తెలుసుకోవడం చూసి ఎంతో నేర్చుకుంటున్నానని.. కంటెస్టెంట్ గా మాత్రం తాను అస్సలు చేయనని నాగార్జున స్పష్టం చేశారు. ఓటీటీ కంటెంట్ కు అనుగుణంగా మనం మారాలని.. ఓటీటీల వల్ల సినిమా చచ్చిపోతుందనడం అబద్ధమని నాగార్జున అన్నారు.