Mia Khalifa: ఓ ఫీ మేల్ పో** స్టార్.. జనం చస్తుంటే నిలువు కాదు.. అడ్డం వీడియోలు కావాలని అడుగుతోంది!

మియా ఖలీఫా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు మియా ఖలీఫా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

Written By: Bhaskar, Updated On : October 11, 2023 1:41 pm

Mia Khalifa

Follow us on

Mia Khalifa: పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయిల్ దేశ సైనికులకు మధ్య భీకరమైన పోరు జరుగుతున్నది తెలుసు కదా! ఇప్పటికే ఇప్పటికే అక్కడ జరుగుతున్న భీకర దాడుల వల్ల వేలాది మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది కన్నుమూస్తారో తెలియదు. యుద్ధం ఎప్పటికీ ముగుస్తుందో కూడా తెలియదు. సమాజంలో మెజారిటీ వర్గాలు ఇజ్రాయిల్ వైపు చూస్తుండగా.. పాలస్తీనాను మరి కొంత సమాజం సపోర్ట్ చేస్తోంది. ఆయా దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇజ్రాయిల్ ఈ విధంగా స్పందించేందుకు ప్రధాన కారణం హమాస్ తీవ్రవాదులు. ఆరోజు గనుక వారు నైట్ పార్టీ మీద రాకెట్ల తో దాడి చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంత ఉధృతంగా మారేందుకు అవకాశం ఉండేది కాదు. చిన్నపిల్లల్ని అత్యంత పాశవికంగా హత్య చేయడం మొదలుపెడితే.. యువతులను అపహరించే దాకా వారి ఆకృత్యాలు కొనసాగాయి. ఇటువంటి దృశ్యాలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని కొంతమంది సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. వారిలో ప్రముఖనీలి చిత్రాల నటి మియా ఖలీఫా హమాస్ తీవ్రవాదులను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మియా ఖలీఫా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు మియా ఖలీఫా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అదే సమయంలో ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు. అంతేకాదు హమాస్ తీవ్రవాదులను మియా.. యోధులుగా కీర్తించడం.. వారు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలను నిలువుగా కాకుండా అడ్డంగా షూట్ చేసి పోస్ట్ చేయాలని హితవు పలకడం విశేషం. కాగా, మియా చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.. చిన్నపిల్లలను హత్య చేస్తున్న ఉగ్రవాదులకు మద్దతుగా ఉండడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “దాడులకు సంబంధించిన దృశ్యాలు సరిగా కనిపించడం లేదు. ఫోన్లను నిలువుగా కాదు. అడ్డంగా పట్టుకొని వీడియోలు తీయమని పాలస్తీనా సమరయోధులకు చెప్పండి. హమాస్ లు స్వాతంత్ర్య సమరయోధులు. మీరు పాలస్తీనాలో పరిస్థితులను చూసి కూడా వారి వైపు నిలబడకుంటే నిలబడకుంటే వర్ణ వివక్షతను సమర్థించినట్టే” అని మియా ఖలీఫా ట్వీట్ చేయడం వివాదాన్ని రేపుతున్నాయి.

ఇజ్రాయిల్ ప్రజలను బందీలుగా పట్టుకున్న హమాస్ లు.. మహిళలను నగ్నంగా ఊరేగించారు. అత్యాచారాలకూ పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన ఏడవ తేదీన మియా ఖలీఫా ట్వీట్ చేశారు. లెబానాన్ జాతీయురాలైన మియా ఖలీఫా చేసిన ట్విట్ లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెనడాకు చెందిన బ్రాడ్ కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ మైఖేల్ షాపిరో తన పాడ్ కాస్ట్ డీల్ నుంచి మియా ఖలీఫాను తప్పించాడు. మరో సంస్థ ప్లే బాయ్ సైతం మియాతో ఒప్పందం రద్దు చేసుకుంది. అయితే తన ట్వీట్లపై ఆమె వెనక్కు తగ్గలేదు. యూదు భావజాలం ఉన్న వారితో ఒప్పందం చేసుకునే ముందు ఆలోచించకపోవడం తనపై తనకే కోపం వస్తోందని పేర్కొంది.