KTR vs Sharmila: కేటీఆర్ ఎవరో తెలియదన్న షర్మిల.. ఇప్పుడు పొగడడానికి కారణమేంటో తెలుసా?

KTR vs Sharmila: తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పార్టీలన్నీ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఓవైపు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ ముఖ్య నేతలను మానసికంగా దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా గత కొద్దిరోజులుగా ప్రధాన పార్టీలన్నీ కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, కవితలను టార్గెట్ […]

Written By: NARESH, Updated On : December 25, 2021 1:36 pm
Follow us on

KTR vs Sharmila: తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పార్టీలన్నీ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఓవైపు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ ముఖ్య నేతలను మానసికంగా దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా గత కొద్దిరోజులుగా ప్రధాన పార్టీలన్నీ కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, కవితలను టార్గెట్ చేస్తున్నాడు. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ లు ప్రధానంగా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఆర్ ను గద్దెదింపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళుతున్నారు.

ఇక ఇటీవల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న సైతం తొలి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న సంగతి తెల్సిందే. గతంలోనూ తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. అప్పట్లోనే కేటీఆర్ ఈ విషయంపై తన బాధను ఓ ఇంటర్వ్యూలో వెళ్లగక్కారు. తాజాగా మరోసారి తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడు హిమాన్షును టార్గెట్ చేయడం తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందని నిలదీసే క్రమంలో తీన్మార్ మల్లన్న హిమాన్షును రాజకీయాల్లోకి లాగాడు. ‘భద్రాచలం గుడిలో అభివృద్ధి జరిగిందా? లేదా హిమన్షు శరీరంలోనా?’ అంటూ సైటర్ వేశాడు.  అయితే దీనిపై మంత్రి కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మల్లన్నను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మల్లన్న కామెంట్లను మంత్రి కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ చేశాడు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదని అలాంటప్పుడు రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అయితే దీనిపై ఆయన నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదని తెలుస్తోంది. కాగా కేటీఆర్ అభిమానులు మాత్రం తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి దిగడం మరింత వివాదాన్ని రాజేస్తోంది.

తనపై దాడికి టీఆర్ఎస్ అనుచరులపై తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కు వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిలా అనుహ్యంగా మద్దతు ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ‘పిల్లలకు ఒక తల్లిగా.. రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుండాయిజాన్ని ఖండిస్తున్నా.. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు.. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి’  అని కేటీఆర్ కు ట్వీట్ ను స్వాగతించారు.

అయితే నిన్నదాకా కేటీఆర్ ఎవరో తెలియదన్న షర్మిలా నేడు ఆయనకు మద్దతు ప్రకటించడం ఒకింత ఆసక్తిని రేపుతోంది. ఈ పరిణామాన్ని అన్నీ పార్టీల నేతలు నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులకు పాల్పడం సహేతుకం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని ఏ పార్టీ నాయకులు చేసినా ఖండించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న టీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీలు ఈ విషయంలో మాత్రం ఒకటి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.