https://oktelugu.com/

Revanth vs Komatireddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏడుపులు.. కోమటిరెడ్డి బ్రదర్స్ కుట్రలు

Revanth vs Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో పీసీసీ చీఫ్ అయినా కూడా ఎలాంటి అధికారాలు.. శాసించే స్థాయి లేకుండా పాపం రేవంత్ రెడ్డి ఉంటున్నారు. పీసీసీ పగ్గాలు దక్కినా ఆయనను ఖాతరు చేసే నేతలు కాంగ్రెస్ లో లేరు. ముఖ్యంగా పక్క పార్టీ టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ కావడంతో కాంగ్రెస్ సీనియర్లకు కంటగింపుగా మారింది. కొందరైతే కాంగ్రెస్ లోనే ఉంటూనే పక్క పార్టీల కోసం పనిచేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. అయినా కూడా వారిని తొలగించలేని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2022 5:52 pm
    Follow us on

    Revanth vs Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో పీసీసీ చీఫ్ అయినా కూడా ఎలాంటి అధికారాలు.. శాసించే స్థాయి లేకుండా పాపం రేవంత్ రెడ్డి ఉంటున్నారు. పీసీసీ పగ్గాలు దక్కినా ఆయనను ఖాతరు చేసే నేతలు కాంగ్రెస్ లో లేరు. ముఖ్యంగా పక్క పార్టీ టీడీపీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్ కావడంతో కాంగ్రెస్ సీనియర్లకు కంటగింపుగా మారింది. కొందరైతే కాంగ్రెస్ లోనే ఉంటూనే పక్క పార్టీల కోసం పనిచేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. అయినా కూడా వారిని తొలగించలేని అసహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

    ఎప్పుడూ ధైర్యంగా ఉండే రేవంత్ రెడ్డి తొలిసారి నిన్న ఏడ్చాడు. కేసీఆర్ ను ధైర్యంగా ఎదురించిన ఈ ధీర నేత సొంత పార్టీ నేతల కుట్రలకు కన్నీరు పెట్టుకున్నాడు. కేసీఆర్ ధాటికి జైలుకెళ్లినప్పుడు కూడా భయపడని రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ కాంగ్రెస్ నేతల కుతంత్రాలకు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ‘కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర ఒక కోణంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే.. ఇంకో కోణంలో రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని కుట్ర కోణం జరుగుతోంది’ అంటూ వలవల ఏడ్చేశారు.

    ఆయన మాటలు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డిని ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతోంది. ఎందుకంటే కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండి.. బీజేపీలో చేరిన తన తమ్ముడిని గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు విడుదలైన కోమటిరెడ్డి ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. తాజాగా కోమటిరెడ్డి ఓ మునుగోడు నేతతో మాట్లాడుతూ.. ‘తన తమ్ముడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని.. అప్పుడే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని ఆయనను తొలగించి తనకు బాధ్యతలు ఇస్తారని.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి తాను కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని.. అప్పుడు మీకు న్యాయం చేస్తానని’ నేతలకు కోమటిరెడ్డి హామీనిచ్చారు. తన ఇంట్లో కొందరిని కూర్చుండబెట్టుకొని వారితో మిగతా వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియోలు లీక్ అయ్యాయి.

    ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కుట్రలకు ఫాపం కాంగ్రెస్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బలి కాబోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి సొంత పార్టీ ఎంపీ కోమటిరెడ్డినే పూనుకోవడం.. బీజేపీలో ఉన్న తమ్ముడిని గెలిపించుకునే కుట్రలో స్వయంగా దొరకడంతో ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ కే వెన్నుపోటు పొడుస్తున్న ఇలాంటి నేతలు ఉండబట్టే తట్టుకోలేక రేవంత్ రెడ్డి కన్నీటి పర్యంతం అవుతున్నారు. కోమటిరెడ్డి లాంటి నేతలను పార్టీ నుంచి ఏరివేయకపోతే ఇలాంటి విషవృక్షాలు పార్టీనే కూకటివేళ్లతో పెకిలిస్తాయని పలువురు కాంగ్రెస్ వాదులు ఆందోళన చెందుతున్నారు.