KCR vs BJP: కేంద్రంపై మరోపోరాటం.. రెడీ అయిన కేసీఆర్..

KCR vs BJP: కేంద్రంపై పోరు సలపడానికి టీఆర్ఎస్ మరోసారి సిద్ధమవుతోంది. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వేదికగా చేసుకోనుంది. గత డిసెంబర్ నుంచి ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కేసీఆర్ ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తాడో పేడో తేల్చుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర సమస్యలపై ఎంపీలతో ఆందోళన చేయించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల సపోర్టు కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా […]

Written By: NARESH, Updated On : July 16, 2022 11:54 am
Follow us on

KCR vs BJP: కేంద్రంపై పోరు సలపడానికి టీఆర్ఎస్ మరోసారి సిద్ధమవుతోంది. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వేదికగా చేసుకోనుంది. గత డిసెంబర్ నుంచి ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కేసీఆర్ ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తాడో పేడో తేల్చుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర సమస్యలపై ఎంపీలతో ఆందోళన చేయించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల సపోర్టు కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ టీఎంసీ, డీఎంకే నేతలతో మాట్లాడారు. కేంద్రంపై ఈసారి చేసే పోరుతో కేంద్రం దిగిరావాలని చూస్తున్నారు.

ఈనెల 18 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణకు నిధులు ఇచ్చే విషయంలో వివక్ష చూపుతున్నారని, ప్రతీ విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. అంతేకాకుండా ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తారని అంటున్నారు. గత ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాలను అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు.

టీఆర్ఎస్ ఎంపీలతో శనివారం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పనున్నారు. అంతేకాకుండా అదే రాష్ట్ర పతి ఎన్నిక ఉన్నందున యశ్వంత్ సిన్హాకే ఓటు వేసేలా చూడాలని చెప్పనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను తెలంగాణకు ఆహ్వానించి ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించారు. కేంద్రం మెడలు వంచేందుకు యశ్వంత్ సిన్హాను గెలిపించుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇప్పుడు ఎంపీలతో సమావేశం అవుతున్నందున మరోసారి ఆ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉండా పార్లమెంట్ సమావేశాలను స్తంబింపజేయడానికి విపక్షాల మద్దతు కోరనున్నారు. ఇప్పటికే టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో కేసీఆర్ పోన్లో సంప్రదించారు. అలాగే డీఎంకే నేతలతో మాట్లాడారు. అయితే మొన్నటి వరకు శివసేన పార్టీ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నా.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పోరాటానికి ఎంత మంది మద్దతు ఇస్తారోనన్న విషయం చర్చనీయాంశంగా మారింది. గత సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలో ధాన్యం కొనుగోలుపై ఆందోళన చేశారు. అయితే ఆ తరువాత కేంద్రం ముడిబియ్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించారు. ఇప్పుడు జరిగే సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఏ విధంగా ఆందోళన చేస్తారో చూడాలి.