https://oktelugu.com/

KCR: కేటీఆర్ ను సీఎం చేయవద్దనే గవర్నర్ తో కేసీఆర్ పంచాయితీనా?

KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు ఊహాతీతం అంటారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. ప్రత్యర్థులు కూడా చదవని పుస్తకం కేసీఆర్ అంటారు. ఆయన నిర్ణయాలు చాలా లోతుగా ఉంటాయని.. దానివెనుక బోలెడంత అర్థం పరమార్థం ఉంటుందంటారు. తాజాగా కేసీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళిసైతో గిచ్చి కయ్యం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ‘హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దాన్ని పక్కనపడేశారని’ గవర్నర్ పై కేసీఆర్ ఇలా ప్రతీకార చర్యలకు దిగుతున్నారని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2022 8:34 pm
    Follow us on

    KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు ఊహాతీతం అంటారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. ప్రత్యర్థులు కూడా చదవని పుస్తకం కేసీఆర్ అంటారు. ఆయన నిర్ణయాలు చాలా లోతుగా ఉంటాయని.. దానివెనుక బోలెడంత అర్థం పరమార్థం ఉంటుందంటారు. తాజాగా కేసీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళిసైతో గిచ్చి కయ్యం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ‘హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దాన్ని పక్కనపడేశారని’ గవర్నర్ పై కేసీఆర్ ఇలా ప్రతీకార చర్యలకు దిగుతున్నారని బయట టాక్. ఇక గవర్నర్ ది మరో వాదన.. తనను, గవర్నర్ వ్యవస్థను అవమానించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.

    అందరూ గవర్నర్ వర్సెస్ కేసీఆర్ పంచాయితీని మాత్రమే చూశారు. కానీ రాజకీయాల్లో కేసీఆర్ లాగానే ఆరితేరి లోతైన విశ్లేషణ చేసే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఇందులో సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.

    నిజానికి గవర్నర్ తలుచుకుంటే కేసీఆర్ సర్కార్ ను ఏమైనా చేయవచ్చని రేవంత్ రెడ్డి ఈ వివాదంలో కాస్త పెట్రోల్ పోసి మంట రాజేశారు. సెక్షన్ 8 పరిధిలో ఉన్న ఏ అంశంపైనైనా అయినా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని.. విద్య, వైద్యం, డ్రగ్స్ పై గవర్నర్ సమీక్ష చేసే అధికారం ఉందని.. గ్రేటర్ పరిధిలో సర్వాధికారాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

    సెక్షన్ 8 అంశాన్ని ప్రస్తావించి కేసీఆర్ పై పైచేయి సాధించేలా రేవంత్ రెడ్డి మంటపెట్టేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఇచ్చారని.. సెక్షన్ 8 ప్రకారం శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్ కు బాధ్యతలుంటాయి. వాటినే తట్టి లేపి రేవంత్ రెడ్డి సంచలన అస్త్రాలు గవర్నర్ కు ఇచ్చారు. తద్వారా బీజేపీకి ఫేవర్ గా రాజకీయం చేస్తున్న గవర్నర్ కు.. అధికార టీఆర్ఎస్ ల మధ్య వివాదాన్ని మరింతగా రాజేశారు.

    అంతేకాదు.. తాజాగా గవర్నర్ వర్సెస్ కేసీఆర్ వివాదంలోని మరో కోణాన్ని సైతం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. కేసీఆర్ కుటుంబంలోని సమస్యల వల్లే గవర్నర్ తో పంచాయితీ పెట్టుకున్నారని.. కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఒత్తిడి కేసీఆర్ పై ఉందని.. అందుకే గవర్నర్ తో లొల్లి పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ తో సఖ్యత లేదనే కారణాన్ని చూపి కేటీఆర్ ను సీఎం కాకుండా కేసీఆర్ ఇలా ప్లాన్ చేశారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

    మొత్తంగా కేసీఆర్ వ్యూహాల్లో ఎవరూ చూడని కోణాలను రేవంత్ రెడ్డి చూసి అవన్నీ బయటపెడుతూ అటు కేసీఆర్ కుటుంబాన్ని.. ఇటు గవర్నర్ ను రెచ్చగొడుతున్న తీరు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి చెప్పేది నిజమో లేక అబద్దమో కానీ అందరికీ నమ్మకం కలిగేలాగానే వ్యాఖ్యానిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.