Income Tax In Budget 2023: ఎన్నో ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు.. అయినా కేంద్రం దాటవేస్తూ వస్తోంది.. ఈసారి కూడా అదే జరుగుతుంది అనుకున్నారు.. కానీ వారందరినీ ఆశ్చర్యపరుస్తూ నిర్మల బంపర్ ఆఫర్ ఇచ్చారు.. అదే వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితి.. ఇక ఈ సాలిడ్ నిర్ణయంతో ఒక్కసారిగా వేతన జీవుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట లభించింది. లక్షలాది మందికి ప్రయోజనం కలిగించేలా వ్యక్తిగత పన్ను పరిమితిని ఏడు లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆమె తెలిపారు. శ్లాబుల సంఖ్య ఏడు నుంచి ఐదుకు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త పన్ను విధానాల్లో మూడు లక్షల వరకు ఎలాంటి ట్యా క్స్ అవసరం లేదని నిర్మల స్పష్టం చేశారు.. ఇదివరకు ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు.. తొమ్మిది లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ఇకపై చెల్లించాల్సిన పన్ను 45000 మాత్రమేనని ఆమె వివరించారు.
Also Read: Farmers Budget 2023: కేంద్ర బడ్జెట్ : రైతులకు కేంద్రం తీపి కబురు.. ఇక పండగేనా ?

కొత్త పన్ను విధానం ఎలా
ఆదాయపు పన్ను పరిమితి ఏడు లక్షలకు పెంపు. శ్లాబుల సంఖ్య ఏడు నుంచి ఐదుకు తగ్గింపు.. పన్ను మినహాయింపు పరిమితి మూడు లక్షలకు పెంపు. 0 నుంచి 3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.. మూడు నుంచి ఆరు లక్షలు వేతన శ్రేణి ఉంటే ఐదు శాతం, ఆరు నుంచి తొమ్మిది లక్షలు ఉంటే 10 శాతం, 9 నుంచి 12 లక్షలు ఉంటే 15%, 12 నుంచి 15 లక్షలు ఉంటే 20 శాతం, 15 లక్షల పైన వేతన శ్రేణి ఉంటే 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.