ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్. ఎక్కడ ఎవరిని ఎలా దెబ్బకొట్టాలో బాగా తెలుసు. నాడు తెలంగాణ విడిపోయిన కొత్తలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణ సర్కార్ ను ఇబ్బందులు పెట్టిన నాటి సీఎం చంద్రబాబును ‘ఓటుకు నోటు’ కేసులో సాగనంపిన చరిత్ర కేసీఆర్ సొంతం. కర్ర విరగకుండా పాము చచ్చేలా కేసీఆర్ చర్యలుంటాయి. మూడో కంటికి.. ముఖ్యంగా మీడియాకు కూడా తెలియకుండా కేసీఆర్ పనులు చక్కబెడుతారు. అలాంటిది కేసీఆర్ కే ఎదురు వెళితే ఏమైనా ఉంటుందా? ఓ సీనియర్ ఐపీఎస్ ఏకంగా కేసీఆర్ ను ఢీకొట్టాడు. ఇప్పుడు ఆయన రిటైర్ అవుదామన్నా కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వకుండా ఏకంగా ఆయనపై రెండు కేసుల్లో విచారణ జరుపుతూ సీనియర్ ఐపీఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేసుల్లో దోషిగా తేలితే ఆయన రిటైర్ మెంట్స్ బెనిఫిట్స్ రాక జైలు పాలయ్యే ప్రమాదంలో పడిపోతారు. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట..
Also Read: మూడేళ్ల తర్వాత పోలీసులతో కేసీఆర్ భేటీ.. అందుకేనా?
వీకే సింగ్. తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా ఎన్నో సంస్కరణలు చేసి పాపులర్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. కొంతకాలంగా తెలంగాణ సర్కార్ పై వీకేసింగ్ తీవ్రంగా మండిపడుతున్నారు. తనకు మంచి పోస్టింగ్ ఇవ్వడం లేదని.. ప్రాధాన్యత కల్పించడం లేదని ప్రభుత్వానికే నేరుగా లేఖలు అప్పట్లో రాసి సంచలనం సృష్టించారు. మొదటి నుంచి సంచలనాలకు కేరాఫ్ గా వీకేసింగ్ ఉన్నారు. జైళ్ల శాఖలో సంస్కరణలు అమలు చేసి పాపులర్ అయ్యారు. కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్ట్ గా ఉంటూ తెలంగాణ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సీరియస్ అయిన తెలంగాణ సర్కార్ ను వీకేసింగ్ ను జైళ్ల శాఖ నుంచి మార్చి ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేసినా ఆయన నోరుపారేసుకోవడం ఆపలేదు. ఇక ఆ తర్వాత పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా నియమించారు. మీడియాపై కూడా నోరుజారి కేసులు పెట్టారు వీకేసింగ్. ఇక ఆ పోస్టును తీసేసి డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు.
సీరియర్ ఐపీఎస్ అధికారి వీకేసింగ్ పెట్టుకున్న వాలంటరీ రిటైర్ మెంట్ ను తెలంగాణ సర్కార్ తిరస్కరించింది. గాంధీ జయంతి రోజున తనకు వీఆర్ఎస్ ఇవ్వాల్సిందిగా ఆయన పెట్టుకున్న ఫైల్ ను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీకే సింగ్ విమర్శలకు ధీటుగా తెలంగాణ సర్కార్ ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్టు సమాచారం. అక్రమ కలప స్మగ్లింగ్ విచారణ చేపట్టి వీకేసింగ్ పాత్ర తేలుస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వీకేసింగ్ పై రెండు కేసుల్లో శాఖపరమైన దర్యాప్తు సాగుతోందని.. ఆయన వీఆర్ఎస్ ను రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
Also Read: కేంద్రం ఆర్డర్స్: పండుగల వేళ ఇవి పాటించాల్సిందే..
అదనపు డీజీగా ఉన్న తనకు డీజీగా ఎందుకు పదోన్నతి ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను పదోన్నతికి పనికిరానా అని విమర్శించారు. తాను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేస్తానని.. వాలంటరీ రిటైర్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు. అయితే ఆయనపై పాత కేసులు తవ్వి తీస్తూ విమర్శలు చేసినందుకు చుక్కలు చూపించే ప్రయత్నాలను కేసీఆర్ సర్కార్ చేస్తోంది. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరీ..