Homeఆంధ్రప్రదేశ్‌Budget 2022: బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం స్టేట్లకు షాకిస్తుందా?

Budget 2022: బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం స్టేట్లకు షాకిస్తుందా?

Budget 2022: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆయా స్టేట్లలో ఆశారేఖలు పెరుగుతున్నాయి. తమ ప్రాంతంపై కేంద్రం కరుణిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల నేపథ్యంలో వాటికి ఏదో ఒక తాంబూలం అందించడం షరామామూలే. కానీ ఏ ఎన్నికలు లేని వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ పలు అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విన్నపాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన కోరికలు బుట్టదాఖలయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

Finance Minister
Finance Minister

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల నేపథ్యంలో కేంద్రం రూపొందించించే బడ్జెట్ పై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. పరిశ్రమల రంగంలో పురోగమించే తెలంగాణకు కేంద్రం ఏదో ఒక రాయితీ ఇవ్వాలని కేటీఆర్ కోరుతున్నారు. ఇప్పటికే నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం ఏదైనా తీపికబురు అందిస్తుందనే ఆశ పెరుగుతోంది. దేశంలోనే ప్రముఖ రాష్ర్టంగా గుర్తింపు పొందుతున్న క్రమంలో కేంద్రం ఏ మేరకు దృష్టి సారిస్తుందో చూడాల్సిందే.

Also Read: విరాట్ కోహ్లీ కూతురు ఫస్ట్ ఫొటో లీక్.. వైరల్.. ఎవరి పోలికో తెలుసా?

కేవలం బీజేపీ పాలిత స్టేట్లపైనే కేంద్రం ఎక్కువగా దృష్టి పెడుతుందనే అపవాదు మూటగట్టుకున్న కేంద్రం ఈ మారు మిగతా స్టేట్లకు సాయం అందిస్తుందా? లేక మొండిచేయి చూపిస్తుందా అనే అనుమానాలు ఎక్కువ మందిలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇంతవరకు ఒరిగిందేమీ లేదు. దీంతో ఈ మారు కూడా సీతకన్నే వేస్తుందనే అంచనాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

Budget 2022:
Budget 2022:

బడ్జెట్ రూపకల్పనలో ఏవో అంకెల గారడీ తప్ప అభివృద్ధి ఉండదనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో వచ్చే బడ్జెట్ కల్పనపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలోనే విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో క్లారిటీ ఇవ్వదని మథనపడిపోతున్నారు. కేటాయింపుల్లో న్యాయం జరగదనే భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చే బడ్జెట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఏ నిర్ణయాలు తీసుకుంటుందో తెలియడం లేదు.

మరోవైపు మూడో సారి కూడా కేంద్రంలో అధికారంలో ఉండాలని భావిస్తున్న బీజేపీ స్టేట్లకు ఏం తాయిలాలు ప్రకటిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు జరిగే స్టేట్లతో పాటు మిగతావి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేపట్టే క్రమంలో బీజేపీ ఏం పాచికలు వేస్తుందో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: ఎక్కిళ్లు తగ్గించే బెస్ట్ మార్గాలు ఇవే !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Gulf Countries: అరబ్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. బాంబుదాడులతో దద్దరిల్లాయి. శాంతి జపం వల్లించే దేశాలు ఒక్కసారిగా ఆందోళన చెందాయి. ఇన్నాళ్లు ఏ గొడవ లేకుండా ఉన్న ప్రాంతాలు కలవరం చెందాయి. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి అంతా హతాశులయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్ మద్దతు ఇస్తున్నట్లుగా అనుమానిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు ఎమిరేట్స్ పై బాంబు దాడి జరిగింది. […]

  2. […] Cinema Gossips: మొన్నటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది. అయినా టాలీవుడ్ డైరెక్టర్స్‌ తీస్తున్న పాన్ ఇండియా మూవీల్లో తనకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలని కోరింది. తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మాట్లాడగలనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చివరగా తెలుగులో కొండపొలం మూవీలో హీరోయిన్‌గా నటించింది రకుల్. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular