Telangana: తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అవినీతి బయటకు వస్తోంది. ఇన్నాళ్లు చాటుగా సాగిన వ్యవహారం కాస్త బజారులో పడింది. కానీ ఎవరు నోరు మెదపడం లేదు. ఓ బడా కంపెనీతో చేయి కలిపి కోట్లాదిరూపాయలు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూతురు పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టినట్లుతెలుస్తోంది. ఇదంతా ఎక్కడిది సదరు బడా కంపెనీయే ఆయనకు ముడుపుల రూపంలో ముట్టజెప్పినట్లు ప్రచారం సాగుతోంది.కానీ మీడియాలో కూడా ఎక్కడా కథనాలు రావడం లేదు.దీంతో అందరూ దొంగలే అనే నానుడి నిజమే అనిపిస్తోంది. ఏదైనా చిన్న కంపెనీ అయితే వరుస కథనాలతో ఊదరగొట్టే మీడియా ఎందుకు సైలెంట్ గా ఉందనే వాదన వినిపిస్తోంది.

రజత్ కుమార్ కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించారు. దీనికి ఖర్చులు మొత్తం సదరు బడా కంపెనీ మేఘా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మీడియా సైతం ఎక్కడ కూడా ఈ విషయం బయటకు రావడం లేదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సైతం దీనిపై పెదవి విప్పడం లేదు. చిన్న విషయానికైతే లగెత్తుకుపోయే మీడియా ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాస్తున్నాయి. ప్రకటనలు ఇవ్వదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాయనేది సత్యం. అయితే ఏదో చిన్న సంస్థ అయితే వరుస కథనాలతో అదిరిపోయే పబ్లిసిటీ ఇచ్చే సంస్థలు రజత్ కుమార్ అవినీతి బాగోతాన్ని ఎందుకు దాస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: Telangana Leader VH Demand: కర్నూలుకు సంజీవయ్య పేరు ఎందుకు పెట్టలేదు.. వీహెచ్ ప్రశ్న
ఇంత జరుగుతున్నా కనీసం దీనిపై విచారణకు కూడా ఆదేశించడం లేదు.ఈ నేపథ్యంలో మీడియా వన్ సైడ్ కవరేజ్ చేస్తోందని తెలుస్తోంది. రజత్ కుమార్ అవినీతి గురించి తెలియనిది ఎవరికి. రాష్ట్రమంతా తెలుసు. కానీ మాకెందుకులే అనే ధోరణిలో పోతున్నట్లు తెలుస్తోంది. చిన్న విషయాలను పెద్దగా ఫోకస్ చేసే రాజకీయ నేతలు సైతం మౌనంగా ఉండటంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇందులో అందరికి వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కిమ్మనకుండా ఉండిపోతున్నారు.
ప్రతి విషయంపై రాద్దాంతం చేసే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రజత్ కుమార్ అవినీతి గురించి తెలియదా? కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నా ఈ అవినీతి గురించి ఎక్కడ చర్చించకపోవడం గమనార్హం. అంటే మేఘా కంపెనీ అంతలా ప్రభావం చూపుతోందన్నమాట. చిన్న లంచాలకే జైలు పాలయ్యే అధికారులు ఇంత పెద్ద లంచగొండిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. అవినీతితో అందలాలెక్కే వారిని ఉపేక్షిస్తే భవిష్యత్ లో లంచావతారులు పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికైనా నోరు తెరిచి అతడి అవినీతిని పెకిలించాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలివే..!
[…] […]