Site icon OkTelugu

Dawood Ibrahim Associate: దావూద్ ఇబ్రహీం అనుచరుడైనంతమాత్రాన.. ఇండియన్ నిఘా నుంచి ఎలా తప్పించుకోగలడు.. ఇదిగో ఇలా దొరికాడు..

Dawood Ibrahim Associate

Dawood Ibrahim Associate

Dawood Ibrahim Associate: పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం చీకటి కాదు. ఈ విషయం దావూద్ ఇబ్రహీం అనుచరుడు తెలుసుకొని ఉంటే బాగుండేది.. కానీ తన మీద తనకే అతి విశ్వాసం వల్ల.. ఇండియన్ ఏజెన్సీలకు దొరికిపోయాడు. వాస్తవానికి ఏడాదిన్నరగా అతడు బయటికి రావడం లేదు. ఎక్కడ ఉన్న టర్కీ లోని ఇస్తాంబుల్ ప్రాంతంలో ఉంటున్నాడు. అత్యంత రహస్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

దావూద్ ఇబ్రహీం బృందానికి సంబంధించి అనేకరకాల కార్యకలాపాలకు ఇతడు పాల్పడుతున్నాడు. అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాడు. ఆయుధాల వ్యాపారాన్ని కూడా అదే స్థాయిలో చేపడుతున్నాడు. దందాలు, సెటిల్మెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతకాలంగా దావూద్ ఇబ్రహీం అంచరుడు సలీం డోల మీద ఇండియన్ ఏజెన్సీలు దృష్టిపెట్టాయి. అతడి మీద విపరీతంగా ఫోకస్ చేశాయి. ఈ విషయం తెలుసుకున్న సలీం జాగ్రత్త పడటం మొదలు పెట్టాడు.. ఇండియన్ ఏజెన్సీలకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.

ఇస్తాంబుల్ ప్రాంతంలో అత్యంత రహస్యమైన జీవితాన్ని గడుపుతున్న సలీం.. ఇటీవల ఒక కొరియర్ ఆర్డర్ చేశాడు. దీంతో అతని లొకేషన్ భారత్ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో ఈ విషయాన్ని ఇస్తాంబుల్ పోలీసులకు చేరవేశాయి. భారత ఏజెన్సీలు చెప్పిన ఆధారాల ప్రకారం ఇస్తాంబుల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడులు చేసి సలీం ను అరెస్ట్ చేశారు.

కొంతకాలంగా దావూద్ గ్యాంగ్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది.. అడ్డగోలుగా దందాలను చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఆ గ్యాంగ్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు దందాలు చేయడం మొదలుపెట్టారు .. ప్రపంచ వ్యాప్తంగా దావూద్ గ్యాంగ్ మీద ఫోకస్ ఉన్న నేపథ్యంలో.. ఇండియన్ ఏజెన్సీలు రంగంలోకి దిగిన నేపథ్యంలో వారు సైలెంట్ అయిపోయారు. అయితే దావూద్ గ్యాంగ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇండియన్ ఏజెన్సీలు.. సలీం చేసిన తప్పును వెంటనే గుర్తించాయి. అతనిని అరెస్ట్ చేశారు. అయితే ఇండియన్ ఏజెన్సీలు ఇంతటితోనే ఆగిపోతాయా.. ఇంకా ఏమైనా అరెస్టులు ఉంటాయా.. అనే విషయాలపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Exit mobile version