Homeఎంటర్టైన్మెంట్Trisha request rejected by Vijay: త్రిష ఆ కోరికను మళ్లీ తిరస్కరించిన సీఎం విజయ్..

Trisha request rejected by Vijay: త్రిష ఆ కోరికను మళ్లీ తిరస్కరించిన సీఎం విజయ్..

Trisha request rejected by Vijay: తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యంత నాటకీయమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చాడు టీవీ కె అధినేత విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోయినప్పటికీ.. తనకున్న లౌక్యం ద్వారా అన్ని పార్టీల మద్దతును కూడగట్టి.. అధికారంలోకి వచ్చాడు విజయ్. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తును మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఏకంగా దేశ రాజకీయాలలో కూడా ప్రవేశించేందుకు విజయ్ రకరకాల ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాజ్యసభలో పాదం మోపడానికి.. రాష్ట్రంలో ఖాళీ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడానికి విజయ్ ఇప్పటికే రకరకాల రాజకీయ వ్యవహారాలను అమలు చేస్తున్నాడు.

విజయ్ రాజీనామా వల్ల తూర్పు తిరుచ్చి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అక్కడ గెలవాలని.. గెలిచి రాజకీయంగా తన పట్టణం తమిళనాడులో మరింత నిలుపుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. అన్నా డీఎంకే నాయకుడు షణ్ముగం రాజీనామా చేసిన నేపథ్యంలో తమిళనాడు కోటాలో ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్ని జరిగే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి ఈ స్థానానికి నామినేషన్లు దాఖలవుతాయి. జూన్ 18న పోలింగ్ జరుగుతుంది. తమిళ రాష్ట్రం నుంచి రాజ్య సభకు ఒక సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. అయితే కేవలం ఒకే ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ మెజారిటీ ఓటింగ్ అనే విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది.

తమిళనాడులో మొత్తం తిరుచ్చి మినహాయించి 23 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు దాదాపు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టి వి కే పార్టీకి ప్రస్తుతం 107 సొంత ఎమ్మెల్యేల బలం ఉంది. టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు 10 ఓట్ల దూరంలో ఉంది. నీ నేపథ్యంలో ఆ పార్టీకి ఇండియన్ ముస్లిం లీగ్, వీసీ కే, సిపిఐ మద్దతు గనుక లభిస్తే విజయం ఖచ్చితంగా కేక్ వాక్ అవుతుంది. అన్నా డీఎంకే లో ఒక వర్గం కూడా విజయ్ కి సపోర్ట్ చేస్తుంది. రాజ్యసభలేదా.. తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని హీరోయిన్ త్రిష కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తిరుచ్చి ఈస్ట్ స్థానంలో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారిని నిలబెట్టేందుకు ఆయన రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన గనుక పోటీకి ఒప్పుకోకపోతే.. మరో అధికారిని రంగంలోకి దించేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల లాల్గుడి నియోజకవర్గంలో ఓడిపోయిన కృపా కృష్ణన్ ను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ లభించడంతో.. కృప పోటీ నుంచి తప్పుకున్నట్టు తేలిపోయింది.

రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వాలని విజయ్ భావించినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవడంతో ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారాన్ని విజయ్ పక్కన పెట్టారు. రాజ్యసభకు విద్యావేత్త లేదా ప్రముఖ వ్యక్తిని పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు తిరుచ్చి ఈస్ట్, ఇటు రాజ్యసభ విషయంలో విజయ్ త్రిషకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో.. ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తు కాలంలో ఏమైనా సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప త్రిష కోరుకున్న కోరిక నెరవేరే పరిస్థితి లేదని ఆమె అభిమానులు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular