Kolkata Trainee Doctor Case : ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పటికే అతడిని పలమార్లు విచారించారు. అతడు పొంతన నేను సమాధానాలు చెప్పడంతో కోర్టు అనుమతితో నిజాలు చెప్పించేందుకు రకరకాల పద్ధతులను అతనిపై ప్రయోగించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ కేసులో మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అధికారులు మరోసారి అరెస్టు చేశారు. అతడు సాక్ష్యాధారాలను ధ్వంసం చేశాడని.. విచారణ ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని.. సిబిఐ అభియోగాలు మోపింది. ఎఫ్ ఐ ఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిజిత్ మండల్ ను కూడా అదుపులోకి తీసుకుంది.. అతడిని కొన్ని గంటల పాటు విచారించింది.. అయినప్పటికీ సరైన సమాధానం చెప్పకపోవడంతో అరెస్టు చేసింది. 8సార్లు ప్రశ్నించినప్పటికీ ప్రతిసారి అతడు వేరువేరు సమాధానాలు చెప్పాడు. ఇక ఈనెల 17న కోల్ కతా హైకోర్టుకు సిబిఐ అధికారులు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. మరో ఇద్దరు పోలీస్ అధికారులపై కూడా సిబిఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అంతకుముందు సిబిఐ సందీప్ ఘోష్ పై అత్యాచారం, ఇతర యోగాలు నమోదు చేసిందని జాతీయ మీడియా చెబుతోంది.
గతంలో కూడా మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్
జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో ఇప్పటికే సందీప్ ఘోష్ సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయనపై పెద్ద పెట్టున ఆరోపణలు రావడంతో ఆయనను సిబిఐ ఈనెల 2న కూడా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. ఆగస్టు 9న కోల్ కతా లోని అర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యాలు హత్యాచారమే గురయ్యారు. ఆ హాల్ నుంచి బయటకు వస్తున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల మేరకు వాలంటీర్ సంజయ్ రాయ్ ని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. నార్కో టెస్ట్ నిర్వహించేందుకు సిబిఐ సమాయత్తమైనప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు.
ఒప్పుకొని మమత
ఇక ఈ కేసులో న్యాయం జరగాలని వైద్యులు బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులకు పైగా వివిధ రూపాలలో నిరసనలు చేపడుతున్నారు. నీ క్రమంలో బెంగాల్ వైద్యులు, మమత మధ్య చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ చర్చలు జరుగుతే అవి ప్రత్యక్ష ప్రసారం చేయాలని వైద్యులు పట్టుబడుతున్నారు. ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అలా ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని మమత చెబుతున్నారు. అంతేకాదు చర్చల్లో అంగీకారానికి గురైన డిమాండ్లపై తాను వెంటనే సంతకం చేస్తానని మమత స్పష్టం చేశారు.. అంతకుముందు మమత వైద్యులు దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వెళ్లారు. ఆమె ఆహ్వానించడంతో పలువురు వైద్యులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంలో చర్చలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారానికి వైద్యులు డిమాండ్ చేయడంతో మమత ఒప్పుకోలేదు. రెండు గంటలపాటు అటు మమత, ఇటు వైద్యులు చర్చలు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రెండు గంటల అనంతరం వైద్యులు కన్నీటితో బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మమత ఆగ్రహంగా మాట్లాడారు. ” నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పదేపదే అవమానిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఇలా చేశారని” మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.