https://oktelugu.com/

Mahesh Babu CM Jagan: మహేష్ సినిమా పై సీఎం జగన్ కన్ను.. హడాలిపోతున్న ఫాన్స్

Mahesh Babu CM Jagan: సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో నటించిన చిత్రం సర్కారు వారి పాట..గీత గోవిందం వంటి సెన్సషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం..అందులోనూ మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఒక్క పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా చెయ్యడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ గానే ఉన్నాయి..దానికి తగ్గట్టు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2022 6:37 pm
    Follow us on

    Mahesh Babu CM Jagan: సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో నటించిన చిత్రం సర్కారు వారి పాట..గీత గోవిందం వంటి సెన్సషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం..అందులోనూ మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఒక్క పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా చెయ్యడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ గానే ఉన్నాయి..దానికి తగ్గట్టు గానే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రతి ప్రాంతం లో భారీ మొత్తానికి జరిగింది..ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ గుబులు ఈ సినిమాని కొన్ని బయ్యర్లకు మొదలు అయ్యింది..ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ జీవో ప్రకారం అయితే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి..ఇటీవల విడుదల అయినా అల్లు అర్జున్ పుష్ప మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినప్పటికీ టికెట్ రేట్స్ లేకపోవడం తో చాలా ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేక నష్టపోవాల్సి వచ్చింది.

    CM Jagan Decision On Mahesh Babu New Movie || AP Ticket Issue || Oktelugu Entertainment

    Mahesh Babu CM Jagan

    Mahesh Babu

    ఇప్పుడు ఈ భయం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకి కూడా పట్టుకుంది..అందుకే చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి తాలూకు డ్రాఫ్ట్ ని సిద్ధం చేసి విడుదలకి నెల రోజులు ముందే ఒక్క 50 రూపాయిల టికెట్ హైక్ కోసం ప్రభుత్వం దగ్గర అనుమతి ని తీసుకోవడానికి అప్లై చేసారు..ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క సినిమాకి టికెట్ హైక్ ఇవ్వాలి అంటే నటీనటుల రెమ్యూనరేషన్స్ కాకుండా 100 కోట్ల రూపాయిల బడ్జెట్ ఉండాలి మరియు 20 శాతం షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్ లో చేసి ఉండాలి..సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మొత్తం ఎక్కువ భాగం విదేశాల లోనే చేసారు..ఇక మన ఇండియా లో అయితే గోవా మరియు హైదరాబాద్ వంటి ప్రాంతాలలోనే తెరకెక్కించారు..ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ చేసిన శాతం చాలా తక్కువ..అంతే కాకుండా నటీనటుల రెమ్యూనరేషన్స్ పక్కన పెడితే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయిలు దాటే అవకాశమే లేదు..దీనితో ఈ సినిమాకి హికెస్ వస్తుందా రాదా అని ఆ చిత్ర మేకర్స్ కంగారు పడిపోతున్నారు.

    Also Read: Mahesh Babu For Acharya: ‘ఆచార్య’కి మహేష్ మాట సాయం.. ఇక తెలుగు నెల దద్దరిల్లిపోద్ది

    కానీ మహేష్ బాబు అంటే ముఖ్యమంత్రి జగన్ గారికి కాస్త అభిమానం ఉండబట్టి సర్కారు వారు పాట సినిమాకి హైక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనే ఆశతో మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు..గతం లో రాధే శ్యామ్ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ తక్కువ శాతం జరిపినప్పటికీ పెద్ద బడ్జెట్ సినిమా కావడం తో ఆఖరి నిమిషం లో నిర్మాతల అభ్యర్థన మేరకు ఒక్క 25 రూపాయిలు టికెట్ రేట్స్ పెంచుకోడానికి అనుమతి ని ఇచ్చింది ప్రభుత్వం..సర్కారు వారి పాట సినిమాకి కూడా అలా ఇచ్చే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మరి ఈ సినిమాకి హైక్ వస్తుందో లేదో చూడాలి మరి..ఇక ఈ సినిమా వచ్చే నెల 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీ లో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ పై ఒక్క మాస్ పాట ని చిత్రీకరిస్తున్నారు..’మ..మ..మహేశు’ అంటూ సాగే ఈ పాట అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఉంటుంది అట..ఈ పాటని మే 1 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు..అలాగే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ ని ఈ నెల 23 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు ఆ మూవీ టీం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.

    Also Read: AP News: సీఎం కాన్వాయ్ కైతే కారు ఇవ్వాల్సిందేనా?

    Recommended Videos:

    Ram Charan Emotional Words About Mega Star Chiranjeevi || Oktelugu Entertainment

    Pawan Kalyan Fans Fear on Hari Hara Veeramallu Movie || Director Krish || Oktelugu Entertainment

    Vijay Devarakonda Samantha Lip Lock Scenes || Shiva Nirvana || Oktelugu Entertainment

    Tags