తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లైవ్ లో రెచ్చిపోయాడు. కోవిడ్ 19 పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించిన బండి సంజయ్ తాజాగా కేసీఆర్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగాడు.కేసీఆర్ ఫాం హౌస్ లో పడుకొని ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశాడని.. కనీసం ఒక్కసారన్న కరోనాపై సమీక్షించాడా? అని విమర్శించారు.
దేశంలో టీకా వేసుకోకుండా.. మాస్క్ పెట్టుకోకుండా.. ప్రజలకు అవగాహన కల్పించని సీఎం కేసీఆర్ యేనని బండి నిప్పులు చెరిగారు. అయితే దీనిపై అక్కడే ఉన్న టీఆర్ఎస్ అనుకూల చానెల్ టీన్యూస్ రిపోర్టర్ కౌంటర్ ఇచ్చాడు.
తెలంగాణలో కంటే బీజేపీ రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అక్కడ మీ పార్టీ సీఎంలు ఏం చేస్తున్నారని.. మోడీ ఏం చేస్తున్నాడని ప్రశ్నించేసరికి బండి సంజయ్ రెచ్చిపోయారు.
అసలు టీ న్యూస్ ను తెలంగాణ బీజేపీ ఆఫీసులోకి రావడమే మేం చేసిన తప్పు అని.. ‘షట్ అప్.. గెట్ అవుట్.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లు’ అంటూ బండి సంజయ్ కోపంతో ఊగిపోయారు. లైవ్ లోనే ఇందంతా జరగడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.
కేసీఆర్ ను తిడుతుంటే అడ్డుకున్న టీ న్యూస్ రిపోర్టర్ బండి సంజయ్ ఆగ్రహ జ్వాలలకు బలికావాల్సి వచ్చింది.