Homeఆంధ్రప్రదేశ్‌NTR Anna Canteen: ఏపీలో తెరుచుకుంటున్న అన్న క్యాంటీన్లు

NTR Anna Canteen: ఏపీలో తెరుచుకుంటున్న అన్న క్యాంటీన్లు

NTR Anna Canteen: మహానాడు సక్సెస్ తో జోష్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపే పనిలో పడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజాసంక్షేమాన్ని ప్రజలు గుర్తుచేసుకునేలా చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా అన్న క్యాంటీన్ల ద్వారా మళ్లీ ప్రజలకు మంచి భోజన రుచి చూపించాలనుకుంటున్నారు. వ్యూహాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల ప్రారంభిస్తున్నారు. ఎన్నారైల సహకారంతో గుంటూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురంలోనూ ఆయన సతీమణి మరొకటి ప్రారంభిచారు. ఇప్పటికే అన్న క్యాంటీన్లు మూతపడిన దగ్గర నుంచి నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు సొంత ఖర్చు.. దాతల ఔదార్యంతో అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు. వాటికి మంచి ఆదరణ ఉండటంతో ఇతర నేతలూ ప్రారంభించేలా మోటివేట్ చేస్తున్నారు.

NTR Anna Canteen
NTR Anna Canteen

టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నార్తులను ఆదుకునేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.5లకు రుచి, శుచి కలిగిన అల్పాహారం, భోజనం అందించారు. ఇందుకుగాను అక్షయపాత్ర సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సుమారు అయిదేళ్ల పాటు అన్నక్యాంటీన్లను దిగ్విజయంగా నడిపించారు. అన్నార్తులతో పాటు కార్మికులు, వీధి వ్యాపారులకు, వివిధ పనులపై పట్టణాలకు వచ్చేవారికి అన్నక్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడేవి.

Also Read: IPL 2022 Final: ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.. గెలుపెవరిది?

కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్న క్యాంటీన్లను మూసివేసింది. నిరుపయోగంగా మారగా.. చాలాచోట్ల సచివాలయ కార్యాలయాలుగా మారాయి. కొన్నిచోట్ల అధికారులను వాటిని అద్దెలకిచ్చి ఆదాయ వనరుగా మార్చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ఊసే ఎత్తకపోవడంతో దానిని తప్పుపడుతూ టీడీపీ ఇప్పుడు నేరుగా అన్న క్యాంటీన్లు నడిపేందుకు నిర్ణయించింది. వ్యూహాత్మకం తన పాలనలో ప్లస్ పాయింట్లను ప్రజల ముందు ఉంచుతోంది. ప్రస్తుత ప్రభుత్వం నగదు బదిలీ పథకాలనే అమలు చేస్తోంది. కానీ ఆ డబ్బు అందుకుంటున్న లబ్దిదారులకు పెరిగిన ధరలతో అవి ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. పథకాల కోసమే రేట్లు పెంచారని నమ్ముతున్నారు. అదే సమయంలో పథకాలు అందని లబ్దిదారుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది.

NTR Anna Canteen
NTR Anna Canteen

నిజానికి అన్న క్యాంటీన్లు చాలా మంది ఆకలి తీర్చాయి. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోలేని పేదలు ఆకలి తీర్చుకునేవారు. స్తోమత ఉన్న వారెవరూ వచ్చే వారు కాదు. చిరుద్యోగులు.. చిరు వ్యాపారులు.. నిలువ నీడ లేని వాళ్ల కడుపు నింపేది. అందుకే వైసీపీ కూడా ఆ సమయంలో తమ పార్టీ తరపున రూ. నాలుగుకే భోజనం పెడతమని వైఎస్ఆర్ క్యాంటీన్లను ప్రారంభించింది. కానీ తీరా అధికారం అందుకున్నా అన్న క్యాంటీన్లతో పాటు వైఎస్ఆర్ క్యాంటీన్లు కూడా మూసేసి పేదలను ఆకలితో అలమటించేలా చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ ఆ అన్న క్యాంటీన్లను గుర్తుకు చెచ్చేందుకు సిద్ధమవుతోంది.

Also Read:Pushpa Part-2: ‘పుష్ప 2’లో వారిద్దరి సీన్సే హైలైట్.. ఆ రెండు సినిమాలనే ఫాలో అవుతున్న సుక్కు !

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular