Site icon OkTelugu

Anant Ambani Lifestyle And Business: ముకేశ్ అంబానీ కొడుకే గాని.. వ్యాపారి మాత్రం కాదు.. అనంత్ అంటేనే డిఫరెంట్..

Anant Ambani Lifestyle And Business

Anant Ambani Lifestyle And Business

Anant Ambani Lifestyle And Business: ఎప్పుడూ నీళ్లలో ఉండే చేపకు జలుబు అంటుకోదు. అలాగే కొంతమంది డబ్బున్న కుటుంబంలో పుట్టినప్పటికీ వారికి డబ్బు జబ్బు చేయదు. అటువంటి వారిలో ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే వ్యాపార కుటుంబంలో పుట్టినప్పటికీ అతనికి డబ్బు అంటే లెక్కలేదు. అలాగని శ్రీమంతుడిలాగా బిల్డ్ అప్ ఇవ్వలేడు. తనలాగా తను ఉంటాడు. తన లోకంలో నివసిస్తూ ఉంటాడు. తను తలుచుకుంటే కొండమీది కోతి నైనా తీసుకురాగలడు. కానీ.. తనకు డబ్బు అనేది జస్ట్ అవసరం మాత్రమే. అందుకే వంతరా లాంటి జంతు సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అది అంత ఈజీ కాదు.. అందులో క్రూరమైన పులులు ఉన్నాయి.. అంతకుమించి గాయపడ్డ సింహాలు కూడా ఉన్నాయి.. అవన్నీ కూడా అతడికి నేస్తాలు.

చిన్నప్పుడు అనంత్ తన తల్లితో కలిసి బయటికి వెళ్లాడు. అక్కడ ఓ చికెన్ షాప్ లో కోళ్లను వధిస్తున్నారు. వాటిని చంపి మాంసం ముక్కలు కొడుతున్నారు. అవి చూసి తట్టుకోలేక తన తల్లితో అనంత్ తన ఆవేదన చెప్పుకున్నాడు. ఆ కోళ్లను చంపకుండా మనం తీసుకెళ్దామని ఆమెతో చెప్పాడు. అప్పుడు అతడిది చిన్న వయసు కాబట్టి.. ముకేశ్ అంబానీ భార్య ఏదో సర్ది చెప్పింది.

అప్పటినుంచి జంతువులంటే అనంత్ అంబానికి విపరీతమైన ప్రేమ ఏర్పడింది. తన శరీరంలో వచ్చిన మార్పులు.. తాను లావుగా అయిన తీరు.. ఇవన్నీ కూడా అతడిని ఇబ్బంది పెట్టాయి. మధ్యలో తను బరువు తగ్గినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ యధా స్థానంలోకి వచ్చేసాడు. అతడికి ఉన్న శ్వాసకోశ సంబంధిత వ్యాధి సమస్య వల్ల ఆ స్థాయిలో బరువు పెరిగాడు. ఆ బరువును తగ్గించుకోవడానికి అతడు చేస్తున్న ప్రయత్నాలు మామూలువి కావు. ఆయనప్పటికీ అతడు బరువు తగ్గడం లేదు. తన బరువును అతడు సమస్య అనుకోవడం లేదు. తన బరువును అధిగమించడానికి అనంత్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.

తన పెళ్లిని గొప్పగా చేసుకున్నాడు. తన ఇష్టం మేరకు సొంత ఊరి ప్రజలకు అద్భుతమైన విందు ఇచ్చాడు. ఆ విందు కూడా తన తండ్రి చేతుల మీదుగా జరిగేలా చేశాడు. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన జంతువుల సంరక్షణ కోసం వంతారా అనే సామ్రాజ్యాన్ని సృష్టించాడు. తాజాగా కొలంబియాలోని మగ్ డలేనా రివర్ బేషన్ పరిధిలో జనాభాషాలకు సమస్యగా మారిన 80 నీటి గుర్రాలను అంతం చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వాటిని చంపకూడదని.. తన జంతు సామ్రాజ్యమైన వంతారాకు తీసుకురావడానికి అనుమతి ఇవ్వాలని అతడు లేఖ రాశాడు.

1980లో మాదకద్రవ్యాల కింగ్ మేకర్ ఎస్కోబార్ తెచ్చి పెంచుకున్న నాలుగు హిప్పోల సంఖ్య అక్కడ 200 కు పెరిగింది. ఆది స్థానికులకు ఇబ్బందిగా మారింది. వాటిని చంపాలని అనుకున్నారు. వాటిని చంపకూడదని అనంత్ లేఖ రాశాడు..

Exit mobile version