https://oktelugu.com/

Analysis on Pawan Kalyan Questions YCP : పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలేవి ?

Analysis on Pawan Kalyan Questions YCP on Konaseema Issue కోనసీమ అల్లర్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనమైంది. ఏపీ హోంమంత్రి డైరెక్టుగా ఈ కుట్ర వెనుక జనసేన ఉందని చెప్పడం పెనుదుమారం రేపింది. ఏలూరు ఐజీ కూడా ఈ కుట్ర వెనుక కారణం తెలియదనడం.. హోంమంత్రి జనసేనపై నెపం వేయడం చర్చనీయాంశమైంది. అమలాపురం రేంజ్ ఐజీకి తెలియని విషయం.. ఏపీ హోంమంత్రికి ఎలా అందిందన్నది ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. ఏదైనా […]

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2022 / 04:57 PM IST
    Follow us on

    Analysis on Pawan Kalyan Questions YCP on Konaseema Issue కోనసీమ అల్లర్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనమైంది. ఏపీ హోంమంత్రి డైరెక్టుగా ఈ కుట్ర వెనుక జనసేన ఉందని చెప్పడం పెనుదుమారం రేపింది. ఏలూరు ఐజీ కూడా ఈ కుట్ర వెనుక కారణం తెలియదనడం.. హోంమంత్రి జనసేనపై నెపం వేయడం చర్చనీయాంశమైంది.

    అమలాపురం రేంజ్ ఐజీకి తెలియని విషయం.. ఏపీ హోంమంత్రికి ఎలా అందిందన్నది ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. ఏదైనా కులాలు, మతాల మధ్య చిచ్చువచ్చినప్పుడు అందరూ శాంతి సంయమనం పాటించాలని చెప్పాలి కానీ.. ఇలా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూరిటీగా ఆలోచించి నిజాలు వెల్లడించారు. పలు ప్రశ్నలను వైసీపీపై సంధించారు. హోంమంత్రిని కడిగేశారు.

    హోంమంత్రికి పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు. ప్రభుత్వం కూడా పవన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయింది. వైసీపీ ట్రాక్ రికార్డ్ ఎప్పుడు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలతో ఉండడంతో వాళ్లు చెప్పే మాటలు ఎవరూ వినడం లేదు.

    కోడీ కత్తి కేసు నీరుగారిపోవడం.. వైఎస్ వివేకా హత్య కేసులో ఎన్నో సందేహాలు తీర్చలేదు. ఇప్పుడు కోనసీమ అల్లర్ల విషయంలో వైసీపీ మాటలు కూడా ఎవరూ నమ్మని పరిస్థితి నెలకొంది. వైసీపీ ట్రాక్ రికార్డ్ ఎప్పుడూ దళితులకు వ్యతిరేకంగానే సాగుతోంది. కులాల రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.