Homeఆంధ్రప్రదేశ్‌Amravati: అమరావతి.. ఏపీ రాజధాని కావడానికి ఏం కావాలి?

Amravati: అమరావతి.. ఏపీ రాజధాని కావడానికి ఏం కావాలి?

Amravati: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అప్రదిష్ట మూటగట్టుకున్నందున రాబోయే కాలంలో దాని నుంచి బయట పడాలని చూస్తోంది. ఇందుకు గాను ఇప్పటి నుంచే అన్ని దారులు వెతుకుతోంది. గతంలో మూడు రాజధానుల వ్యవహారంతో విమర్శలే ఎదుర్కొంది. అందుకే ఇక ప్రజల ఆగ్రహానికి గురయ్యే పనులు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ మెటీరియల్ వస్తుండటంతో నిర్మాణాలు ఇక వేగవంతం పుంజుకుంటాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Amravati
Amravati

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తరువాత అమరావతిని వదిలేసి మూడు రాజధానుల పల్లవి అందుకుంది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. కోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఇందుకు గాను చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక మూడు రాజధానుల ఊసే ఎత్తొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతటితో ఆగితే ఫర్వాలేదు కానీ మళ్లీ జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తే అగచాట్లు తప్పవనే విషయం గ్రహించినట్లు ఉంది.

Also Read: Acharya Dharmasthali: ఆచార్య ‘ధర్మస్థలి’ పై కొరటాల క్రేజీ కామెంట్స్ !

అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. రైతుల సంక్షేమం కోసం ఆగిపోయిన అన్నింటిని తిరిగి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసమే నిర్మాణాలకు అవసరమయ్యే మెటీరియల్ ను సమకూర్చుకుంటోంది. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చూస్తోంది, న్యాయ నిపుణుల సలహాల, సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తోంది. దీనికి గాను పార్టీ వర్గాలు సైతం పునర్మిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

Amravati
Amravati

జగన్ జగమెరిగిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీని ముందుకు నడిపించే క్రమంలో మరిన్ని సాహసోపేతమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయపార్టీల్లో మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీకి జవసత్వాలునింపాలని చూస్తోంది. పార్టీ నిర్ణయాల మేరకు అందరు పనిచేయాల్సి ఉంటుంది. అందుకే అమరావతిని అభివృద్దిచేయాలని భావించినట్లు తెలుస్తోంది.

Also Read:YCP- Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన వైసీపీ..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Disha Act in AP: మహిళలపై దారుణాలు, ఆకృత్యాలు పెరుగుతున్నాయి. రోజుకో ఘటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆడపిల్ల బయటకు వెళితే సురక్షితంగా తిరిగొస్తుందనే నమ్మకం లేకుండా పోతోంది. అడుగడుగునా అత్యాచారాలు, పూటకో వేధింపులు ఫలితంగా సగటు మహిళ బతుకు అగమ్యగోచరంగా మారుతోంది. కంటికి రెప్పలా కాపాడతామని చెబుతున్న ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉంటున్నాయి. దీంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని బతుకులు తెల్లారిపోతున్నాయి. అయినా నిందితులకు శిక్ష పడిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular