వివాదాస్పద చైనా కిట్ లు వెనక్కు..

కరోనా పరీక్షల కోసం చైనా నుండి దిగుమతి చేసుకున్న కిట్ లు నాణ్యత ప్రమాణాల పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాటిని వెనుకకు పంపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం వాటి వాడకాన్ని నిలిపివేయమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ఆదేశించడం తెలిసిందే. క‌రోనా టెస్టుల కోసం చైనా నుంచి భారీగా కిట్స్ దిగుమ‌తి చేసుకోగా వాటిని మ‌ళ్లీ వెన‌క్కి పంపించేందుకు చర్య‌లు ప్రారంభించింది. చైనా కు చెందిన […]

Written By: Neelambaram, Updated On : April 27, 2020 6:10 pm
Follow us on


కరోనా పరీక్షల కోసం చైనా నుండి దిగుమతి చేసుకున్న కిట్ లు నాణ్యత ప్రమాణాల పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాటిని వెనుకకు పంపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం వాటి వాడకాన్ని నిలిపివేయమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ఆదేశించడం తెలిసిందే.

క‌రోనా టెస్టుల కోసం చైనా నుంచి భారీగా కిట్స్ దిగుమ‌తి చేసుకోగా వాటిని మ‌ళ్లీ వెన‌క్కి పంపించేందుకు చర్య‌లు ప్రారంభించింది. చైనా కు చెందిన గ్వాంగ్జౌ వోన్డ్‌ఫో బయోటెక్, జుహాయి లివ్‌జాన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల ఉత్పత్తుల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని ఐసిఎంఆర్ స్పష్టం చేసింది.

ఈ కిట్లు కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వస్తాయని కంపెనీ భరోసా ఇచ్చింది, కానీ పరీక్షలు నిర్వహించినప్పుడు ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపించిందని ఐసీఎంఆర్ వెల్లడించింది.

కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఈ కిట్‌ల‌ను దిగుమతి చేసుకున్నాయని, వెంట‌నే వీటి వాడకాన్ని నిలిపివేసి, చైనాకు తిప్పి పంపించాలని ఆదేశించింది.

మొదటి నుండి భారత దేశంలో అనుసరిస్తున్న ఆర్టీ-పీసీఆర్ విధానం ద్వారా నిర్వహించే పరీక్షలే కరోనా నిర్ధారణకు ప్రామాణికమ‌ని ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. ఈ విధానం ద్వారానే కరోనాను తొలి దశలోనే గుర్తించడం సాధ్యమ‌ని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి ఆర్టీ-పీసీఆర్ విధానమే అత్యుత్తమ మార్గ‌మ‌ని రాష్ట్రాలకు సూచించింది.