లాక్ డౌన్ లో అత్తారింటికి వెళ్లిన ఎస్సై.. ఆ తర్వాత ఏమైందంటే!

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికైతే పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. అయితే ఓ ఎస్సై చేసిన పని ఉన్నతాధికారులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కరోనా పోరాటంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా అత్తగారింటికి వెళ్లాడు. రెండ్రోరోజులు అక్కడే ఉండి తిరిగొచ్చి విధులు నిర్వహించిన విషయం తెలియడంతో […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 12:34 pm
Follow us on


దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికైతే పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. అయితే ఓ ఎస్సై చేసిన పని ఉన్నతాధికారులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కరోనా పోరాటంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా అత్తగారింటికి వెళ్లాడు. రెండ్రోరోజులు అక్కడే ఉండి తిరిగొచ్చి విధులు నిర్వహించిన విషయం తెలియడంతో పోలీసులు ఎస్సై కుటుంబాన్ని, అతడి అత్తగారి కుటుంబాన్ని ముందుజాగ్రత్తగా క్వారంటైన్ కు తరలించారు.

పశ్చిమ గోదావరి జిల్లా జీలుమిల్లి ఎస్సై సాధిక్ భార్య ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో అతడు తన తల్లిదండ్రులతో కలిసి తన భార్యను చూడటానికి తెలంగాణలోని సత్తుపల్లికి వెళ్లాడు. అత్తగారింట్లో రెండ్రోజులు ఉండి తిరిగి పశ్చిమ గోదావరికి చేరుకున్నారు. సరిహద్దు దాటి వెళ్లిన విషయం అధికారులతో తెలిసింది. దీంతో ఎస్సై కి వైద్యులతో పరీక్షలు నిర్వహించి క్వారంట్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఎస్సైతోపాటు అతడి కుటుంబాన్ని, అత్తగారి కుటుంబాన్ని క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అలాగే తెలంగాణలో ఒకరిద్దరు కానిస్టేబుళ్లు క్వారంటైన్లో ఉన్నారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తే సామాన్యులను కఠినంగా శిక్షిస్తున్న పోలీసులకు లాక్డౌన్ నిబంధనలు వర్తించావా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!