మే 4 నుంచి కూడా ప్రజా రవాణా అనుమానమే?

దేశంలో తొలుత 21 రోజులు, అనంతరం మరో 19 రోజులు చొప్పున మొత్తం 40 రోజుల లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా, 4వ తేదీ నుంచి విమానాలు, రైళ్లు నడవటం అనుమానమేనని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంతవరకూ స్పష్టమైన ప్రకటనేదీ కేంద్రం నుంచి వెలువడలేదు. అయితే, రెండు రోజుల కిందట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రులు, ప్రయాణాలను మే 15 తరువాత అనుమతించే ఆలోచన చేయాలని సిఫార్సు చేసినట్టు […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 1:22 pm
Follow us on


దేశంలో తొలుత 21 రోజులు, అనంతరం మరో 19 రోజులు చొప్పున మొత్తం 40 రోజుల లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా, 4వ తేదీ నుంచి విమానాలు, రైళ్లు నడవటం అనుమానమేనని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంతవరకూ స్పష్టమైన ప్రకటనేదీ కేంద్రం నుంచి వెలువడలేదు. అయితే, రెండు రోజుల కిందట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రులు, ప్రయాణాలను మే 15 తరువాత అనుమతించే ఆలోచన చేయాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

విమానాల సర్వీసులపై ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇదే సమయంలో విమానాలను పార్కింగ్ చేసి వుండటం ఆయా సంస్థల ఖర్చును పెంచుతోంది. మే 4 నుంచి కూడా ప్రయాణాలపై ఆంక్షలు ఉండవచ్చు. 15 తరువాత పరిస్థితిపై తదుపరి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి” అని ఇదే సమావేశానికి హాజరై, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. విమాన సర్వీసుల విషయమై ఆ శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మొత్తం 14,175 యాక్టివ్ కేసులుండగా, 2,546 మంది కోవిడ్ నుంచి కొలుకున్నారు. 543 మంది మరణించారు. రోజు సుమారు వెయ్యి కొత్త కేసులు నమోదు అవుతుండటం విశేషం.

దేశంలో విమానాలు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఓ తేదీని నిర్ణయించలేదు. నిజం చెప్పాలంటే ఇందుకు కొంత సమయం పడుతుందనేది స్పష్టమవుతుంది. ప్రజా రవాణా పునరుద్ధరణ అంటే, లాక్ డౌన్ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చు. ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశవాళీ సర్వీసులకు, జూన్ 1 నుంచి విదేశీ సర్వీసులను టికెట్ల బుకింగ్ ను ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేంద్రం నిర్ణయం ప్రకటించే వరకూ ఎటువంటి బుకింగ్స్ నిర్వహించ వద్దని విమానయాన సంస్థలకు సూచించింది.