https://oktelugu.com/

బ్రదర్ అనిల్ కుమార్ కి తప్పిన పెను ప్రమాదం

ప్రముఖ క్రైస్తవ ప్రచారకుడు, దివంగత వైస్సార్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కారు, ఆక్సిడెంట్ కి గురైంది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ కి స్వల్ప గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్నటి రాత్రి తన పర్యటనను ముగించుకుని బ్రదర్ అనిల్ కుమార్ తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా.. మార్గంమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై గోతిలోకి వెళ్తున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 15, 2020 / 05:01 PM IST
    Follow us on


    ప్రముఖ క్రైస్తవ ప్రచారకుడు, దివంగత వైస్సార్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కారు, ఆక్సిడెంట్ కి గురైంది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ కి స్వల్ప గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

    నిన్నటి రాత్రి తన పర్యటనను ముగించుకుని బ్రదర్ అనిల్ కుమార్ తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా.. మార్గంమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై గోతిలోకి వెళ్తున్న కారును మళ్లించారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

    అనిల్, తన డ్రైవర్.. సహచరులకు ఫోన్ చేయడంతో, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనస్థలానికి వెళ్లి అనిల్ కుమార్ ను తన కారులో విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.