టీడీపీతో పొత్తుకు బీజేపీ నో

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన భుజస్కందాలపై మోస్తున్నారు. పాతికేళ్లుగా పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు పాట్లు పడుతున్నారు. గ్లామర్ లేదు.. పైగా మాటకారి కూడా కాదు అయినా సరే పార్టీని తన శక్తితో నడిపిస్తున్నారు. కాలం కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ఉపద్రవం తప్పదు. టీడీపీ నేతకు రెండేళ్లుగా అదృష్టం సహకరించడం లేదు. మరో వైపు వైసీపీ బలం ముందు చంద్రబాబు బలాదూర్ అయిపోతున్నారు. ఏపీలో అన్ని పార్టీలను కలుపుకుని పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోంది. మహానాడులో జరిగిన […]

Written By: Srinivas, Updated On : May 30, 2021 3:59 pm
Follow us on

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన భుజస్కందాలపై మోస్తున్నారు. పాతికేళ్లుగా పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు పాట్లు పడుతున్నారు. గ్లామర్ లేదు.. పైగా మాటకారి కూడా కాదు అయినా సరే పార్టీని తన శక్తితో నడిపిస్తున్నారు. కాలం కలిసి రాకపోతే ఎంతటి వారికైనా ఉపద్రవం తప్పదు. టీడీపీ నేతకు రెండేళ్లుగా అదృష్టం సహకరించడం లేదు. మరో వైపు వైసీపీ బలం ముందు చంద్రబాబు బలాదూర్ అయిపోతున్నారు.

ఏపీలో అన్ని పార్టీలను కలుపుకుని పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోంది. మహానాడులో జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేసింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు నిజమైన మిత్రులు ఎవరూ లేరు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు అనే సామెత ప్రకారం బాబు పరిస్థితి మారింది. ఏపీలో ఇప్పటిదాకా టీడీపీ వెంట ఉన్న సీపీఐ కూడా చేతులెత్తేసింది. మహానాడులో చేసిన తీర్మానంతో గుడ్ బై చెప్పేసింది. బీజేపీకి దశలవారీగా మద్దతు ఇస్తామని పేర్కొనడంతో సీపీఐ మండిపడుతోంది.

బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నా టీడీపీ ముఖం చూసేది లేదని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ డియోధర్ చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ లా కాదని, మోడీకే వెన్నుపోటు పొడిచారని అన్నారు. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు. ఏపీలో జనసేనతోనే పొత్తు ఉంటుందని ప్రకటించారు. వైసీపీ, టీడీపీని ఎదుర్కొంటామని సునీల్ అన్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తుల విషయం కలలు మానుకోవాలని సూచించారు.

ఏపీలో వైసీపీ బలమైన పార్టీ. ఇందులో సందేహం లేదు. వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీ బలం సరిపోదు. బీజేపీ, జనసేన వంటి వాటితో ముందుకు రావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ససేమిరా పొత్తు లేదని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఊసెత్తితే మాతో కట్ అని చెబుతున్నారు. బాబు తీరుకు బీజేపీ నో చెప్పడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంలో పడినట్లయింది. పాతికేళ్ల ర ాజకీయం చివరికి వికటించి తమ్ముళ్లు చింతించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.