India Women World Cup 2023: మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారు? అప్పట్లో చర్చకు తావిచ్చిన ప్రశ్న ఇది. బహుశా సమాధానం లేని ప్రశ్న కూడా. అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ప్రశ్నకు త్రిష రూపంలో సమాధానం లభించింది.. అంతేకాదు మహిళా క్రికెట్ అంతగా పరిగణలోకి తీసుకొని వారికి కూడా సమాధానం లభించింది.. కూడా కొన్ని వందల ప్రశ్నలకు… ఎస్… ప్రపంచం మారుతోంది.. వంటింటి కుందేలు అనే సామెత కూడా మరుగున పడుతుంది.. తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతుంది.. లేకపోతే అండర్ 19 వరల్డ్ కప్ ఇండియాకు దక్కేదా? ఓ త్రిష కథ వింటే కన్నీళ్లు చెమర్చుతాయి.. ఓ శబ్నం గాధ వింటే గుండె బరువెక్కుతుంది. ఒకరా ఇద్దరా.. ఒక టోర్నీ విజయంతో ఎంతో మంది భవిష్యత్తు తారలు పుట్టుకొచ్చారు.. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది వస్తారు.. పాత నీరు పోతే కొత్తనీరు రావాల్సిందే.. కొత్తనీరు ఉదృతంగా ప్రవహిస్తే ఎన్ని అడ్డంకులైనా కొట్టుకుపోవాల్సిందే.

India Women World Cup 2023
1983 వరల్డ్ కప్ లో ఆడేందుకు కపిల్ టీం వెళ్లింది.. చాలామంది గేలీ చేశారు.. వీళ్ళేం ఆడతారు? లీగ్ లోనే ఇంటికి వస్తారు అని హేళన చేశారు.. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా బలమైన విండీస్ టీం ను కపిల్ నాయకత్వంలోని ఆటగాళ్లు ఓడించారు.. భారతదేశానికి తొలిసారిగా వరల్డ్ కప్ తీసుకొచ్చారు.. ఆ విజయం తర్వాత భారత క్రికెట్ గతి మారిపోయింది.. ఎంతోమంది వర్తమాన క్రీడాకారులు క్రికెట్ లోకి ప్రవేశించారు.. అనితర సాధ్యమైన విజయాలు సాధించారు.. ఇప్పుడు అండర్ 19 కప్ కు వెళ్లే ముందు కూడా భారత జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సీనియర్ జట్టులో ఆడే షఫాలీ వర్మ, రీచా ఘోష్ ను మినహాయిస్తే… మిగతా ఆటగాళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ వారే బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత జట్టుకు కప్ తీసుకొచ్చారు. తద్వారా దేశ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు. మహిళల క్రికెట్ భవిష్యత్తుకు డోకా లేదనే భరోసా కల్పించారు.. అసలు ఇంతకు ఈ క్రీడాకారిణులు ఎక్కడి నుంచి వచ్చారు… ఒకసారి ఆ వివరాలు పరిశీలిస్తే..
షఫాలీ వర్మ
హర్యానాలోని రోహు తక్ ప్రాంతానికి చెందిన ఈ యువతి… విధ్వంసకర ఓపెనర్ గా మూడు ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆడిన అనుభవం ఉంది.. అంతర్జాతీయ క్రికెట్లో అతి ( 15 సంవత్సరాల 285 రోజులు) చిన్న వయసులో అర్థ సెంచరీ చేసి సచిన్ రికార్డు అధిగమించింది.
గొంగడి త్రిష
భద్రాచలం కు చెందిన ఈ తండ్రి రామ్ రెడ్డి అండర్ 16 జాతీయ హాకీ మాజీ ఆటగాడు.. త్రిష క్రికెట్ ఆశలను ముందుకు తీసుకెళ్లేందుకు తన పూర్వీకుల ద్వారా లభించిన నాలుగు ఎకరాల భూమిని అమ్మేశాడు..జిమ్ సైతం నష్టాలకు విక్రయించాడు.. కుటుంబాన్ని సికింద్రాబాద్ కు మార్చాడు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.. త్రిష మిథాలీ రాజ్ లేని లోటు భర్తీ చేయగలదనే సంకేతాలు ఇస్తోంది.. ఓ అర్ధ సెంచరీ తో పాటు, ఫైనల్ మ్యాచ్లో 24 పరుగులు సాధించింది త్రిష.
షబ్నం
విశాఖపట్నం కి చెందిన షబ్నం ఈ మెగా టోర్నీలో ఎక్కువ అవకాశాలు రాలేదు.. ఈమె తండ్రి నావిలో పనిచేస్తుంటారు.. ఈమె ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక వికెట్ తీసింది. పదునైన బంతులు వేయడంలో దిట్ట.

India Women World Cup 2023
సోనం యాదవ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనం తండ్రి గ్లాస్ ఫ్యాక్టరీ కార్మికుడు.. చిన్నతనంలో బాలులతో కలిసి క్రికెట్ ఆడుతున్న కూతురు ఆసక్తిని గమనించి అకాడమీలో చేర్పించాడు.. కోచ్ సూచన మేరకు బ్యాటర్ నుంచి స్పిన్నర్ గా మారిన సోనం ఆర్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకుంది.
మన్నత్ కశ్యప్
పాటియాలా కు చెందిన మన్నత్ చిన్నతనంలో గల్లి క్రికెట్ విపరీతంగా ఆడేది. సోదరుడి సూచన మేరకు ఆటను సీరియస్ గా తీసుకుంది.. అకాడమీలో శిక్షణ పొందింది.. భారత జట్టుకు ఎంపికైంది.. చక్కటి వేగంతో పాటు కచ్చితంగా బంతులు వేయడంలో దిట్ట.. అందుకే ఆర్ మ్యాచ్లో 9 వికెట్లు తీయగలిగింది.
టిటాస్ సాధు
చక్కటి బౌన్స్ తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సామర్థ్యం బెంగాల్ రాష్ట్రానికి చెందిన సాధు సొంతం. తన కుటుంబానికి సొంతంగా క్రికెట్ క్లబ్ ఉంది.. తండ్రి లాగా స్ప్రింటర్ గా మారాలి అనుకున్న సాధు… పదో తరగతిలో 93% మార్కులు సాధించి ఔరా అనిపించింది.. క్రికెట్ కోసం చదువును పక్కనపెట్టింది.
పర్శవి చోప్రా
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కు చెందిన 16 ఏళ్ల పర్శవి ప్రతి మ్యాచ్ లోనూ సత్తా చూపింది.. ఆడిన ఆరు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను వణికిస్తూ 11 వికెట్లను తీసింది. ఈ యువతి ఇలానే రాణిస్తే ఖచ్చితంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటుంది.
అర్చన దేవి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్చన పేదరికంలో పుట్టి పెరిగింది.. ఆమెకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్ తో మరణించాడు.. ఆ తర్వాత అర్చన కొట్టిన బంతిని వెతికే క్రమంలో సోదరుడు పాము కాటుకు గురై మృతి చెందాడు.. ఈ విషాదాలను అధిగమిస్తూ తన టీచర్ ప్రోత్సాహంతో క్రికెటర్ గా రాణించాలి అనుకుంది. కాన్పూర్ లోని కోచ్ కపిల్ పాండే అకాడమీలో భారత స్పిన్నర్ కులదీప్ యాదవ్ సలహాలు కూడా ఆమెను రాటు తేల్చాయి.. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన క్యాచ్ తో పాటు రెండు వికెట్లను పడగొట్టింది.. ఓవరాల్ గా 8 వికెట్లు తీసి టైటిల్ వేటలో కీలకపాత్ర పోషించింది.
రిచా ఘోష్
ధోనిని అమితంగా ఆరాధించే ఈ బెంగాలీ క్రికెటర్… ఇప్పటికే జాతీయ జట్టులో సభ్యురాలు… గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన సీరియస్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నది.. వరల్డ్ కప్ లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ 93 పరుగులు సాధించింది.
శ్వేత సేహ్రావత్
దక్షిణ ఢిల్లీకి చెందిన ఈ యువతి తొలి ప్రాధాన్యం క్రికెట్ కాదు. మొదట వాలీబాల్, బ్యాడ్మింటన్, స్కేటింగ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాకే క్రికెట్ వైపు మరలింది.. ఆడిన ఇన్నింగ్స్ ల్లో 297 పరుగులతో టాపర్ గా నిలిచింది. జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది.
సౌమ్య తివారి
ఈ యువతిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్. చిన్నతనంలో తన తల్లి దుస్తులు ఉతికేందుకు ఉపయోగించే చెక్క తెడ్డుతో సౌమ్య క్రికెట్ ఆడటం ప్రారంభించింది. మొదట కోచ్ సురేష్ చియానాని ఆమెకు క్రికెట్ నేర్పించేందుకు నిరాకరించాడట.. ఆ తర్వాత సౌమ్య పట్టుదలను గమనించి మెలకువలు నేర్పి రాటు తేల్చాడు.. సౌమ్య ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై బాధ్యతయుతంగా ఆడి త్రిష కలిసి జట్టును గెలిపించింది..