India vs New Zealand: టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ కు ఎంత తప్పు చేసాడో భారత ఉపేందర్ల బ్యాటింగ్ చూస్తే కానీ అర్థం కాలేదు. “డోంట్ స్టాప్ రన్నింగ్… రన్స్ లోడింగ్” అన్నట్టుగా వారి బ్యాటింగ్ సాగింది.. గిల్, రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.. గిల్ అయితే న్యూజిలాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు.. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్ లో మరో సెంచరీ సాధించాడు.. తొలి మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన అతడు… మూడో మ్యాచ్ లోనూ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు.. తొలి వికెట్ కు గిల్, రోహిత్ శర్మ 212 పరుగులు చేశారంటే వారు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

India vs New Zealand
మిడిల్ ఫెయిల్
ఓపెనర్లు అందించిన గట్టి శుభారంభం మిడిల్ ఆర్డర్ వినియోగించుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ 36 పరుగులు చేసి అవుట్ కాగా, ఇషాంత్ కిషన్ 17 పరుగులు చేసి రన్ అవుట్ గా వెనుతిరిగాడు. టి20 ఫార్మాట్ కు బాగా అలవాటు పడిన సూర్యకుమార్ యాదవ్… వన్డే ఫార్మాట్లో తేలిపోతున్నాడు.. ఈ మ్యాచ్లో కూడా 14 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెను తిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు.. 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి బ్యాట్స్ మెన్ కూడా అంతగా ప్రభావం చూపలేదు. ఒకానొక దశలో 400 పరుగులు పైచిలుకు చేస్తుంది అనుకున్న ఇండియా… తొమ్మిది వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.

India vs New Zealand
మొదట్లో తేలిపోయారు తర్వాత తేరుకున్నారు
న్యూజిలాండ్ బౌలర్లు ఈ సిరీస్ లో మొదట తేలిపోతున్నారు… తర్వాత తేరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో కూడా అదే విధానాన్ని అనుసరించారు. 212 పరుగుల దాకా తొలి వికెట్ తీయలేకపోయిన న్యూజిలాండ్ బౌలర్లు… తర్వాత పుంజుకున్నారు.. వెంట వెంటనే వికెట్లు తీసి భారత్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పకుండా చేశారు. 212 పరుగులకు తొలి వికెట్ తీసిన న్యూజిలాండ్ బౌలర్లు…230 పరుగుల వద్ద రెండు, 268 పరుగుల వద్ద మూడు, 284 పరుగుల వద్ద నాలుగు, 293 పరుగుల వద్ద ఐదు, 313 పరుగుల వద్ద ఆరు…367 వద్ద ఏడు,
379 పరుగుల వద్ద ఎనిమిది, 385 పరుగుల వద్ద తొమ్మిది వికెట్లు తీశారు. డఫీ, టిక్న ర్ తలా మూడు, బ్రేస్ వెల్ ఒక వికెట్ తీశారు.