
Mitchell Starc
Mitchell Starc: రోహిత్, గిల్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్.. ఇండియన్ క్రికెట్లో తోపు బ్యాటర్లు. కానీ వీరిని తన నిప్పులాంటి బంతులతో బోల్తా కొట్టించాడు స్టార్క్. అసలు ఇండియా ఆడుతోంది భారత్ లోనేనా అనే అనుమానం కలిగించాడు. తొలి ఓవర్ మూడో బంతికే గిల్ ను ఎల్ బీ డబ్ల్యూ రూపం లో ఔట్ చేసిన స్టార్క్.. ఇక దశలోనూ భారత జట్టును కోలుకోనియలేదు.
అతగాడి బంతుల ధాటికి రోహిత్, సూర్య, రాహుల్ వణికి పోయారు. ముఖ్యంగా సూర్య అయితే తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్ బీ డబ్ల్యు గా ఔట్ అయ్యాడు. ఇలా గోల్డెన్ డక్ గా ఔట్ కావడం సూర్య కు ఇది రెండో సారి. మొదటి మ్యాచ్ లోనూ అతడు స్టార్క్ బౌలింగ్ లో ఇలానే ఔట్ అయ్యాడు.రాహుల్ ను కూడా ఇలానే ఔట్ చేశాడు. మొదటి వన్డే లో 188 పరుగులు ఆస్ట్రేలియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది.. ఇందులో స్టార్క్ పాత్ర ఉంది. ఇండియా టాప్ బ్యాట్స్ మెన్ గిల్, సూర్య, కోహ్లీ ని అతడు పెవిలియన్ పంపించాడు. ఒకవేళ రాహుల్, జడేజా నిలబడకపోయి ఉంటే భారత్ ఓటమిని మూట కట్టుకొని ఉండేది. తన బౌలింగ్ తో ఆస్ట్రేలియా జట్టును మొదటి వన్డేలో దాదాపు గెలిపించినంత పని చేశాడు స్టార్క్. ఇక రెండో వన్డే లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. మైదానం మీద ఉన్న తేమను వినియోగించుకుంటూ పదునైన బంతులు వేసి భారత బ్యాటర్ల కు చుక్కలు చూపించాడు.
పదునైన పెస్ బౌలింగ్ వేయడంలో స్టార్క్ దిట్ట. అతడు ఒక్కప్పటి మెక్ గ్రాత్ ను గుర్తు చేస్తున్నాడు. జట్టు ఎలాంటి స్థితిలో ఉన్నా,మైదానం ఎలా ఉన్నా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అతడి నైజం. ఇప్పటివరకు 109 వన్డేలు ఆడిన స్టార్క్ 213 వికెట్లు తీశాడు. ఇందులో 9 సార్లు 5 వికెట్లు తీశాడు. 77 టెస్ట్ లు ఆడి 306 వికెట్లు తీశాడు. టీ 20 లో 58 మ్యాచ్ లు ఆడి 73 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ఫోర్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఆదివారం విశాఖపట్నంలో ఇండియా పై జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడు. టెస్ట్ ల్లో 13 , టీ 20 లో 42 వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Mitchell Starc
ఇక రెండో వన్డేలో ఐదు వికెట్లు తీసిన నేపథ్యంలో.. నెటిజన్లు ఇతగాడి బౌలింగ్ ను పొగుడుతున్నారు.. ఐదు వికెట్లు తీయడం పట్ల ఆకాశానికి ఎత్తుతున్నారు.. నువ్వు వేసింది బంతులా లేక నిప్పు కణికలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్క్ బౌలింగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది.
Mitchell Starc going to dressing room be like : #INDvsAUS pic.twitter.com/oQZPRAsPu9
— RADHE ࿗🚬🇮🇳 (@Iamradhe_p00) March 19, 2023