
India vs Australia
India vs Australia: మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసింది. సీరిస్‌లో 1-1తో సమంగా నిలిచింది. అది కూడా పదివికెట్ల తేడాతో.. విశాఖపట్టణంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 117 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ ఐదు, అబాట్ మూడు, ఎల్లీస్ రెండు వికెట్లు తీశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఆస్ట్రేలియా బౌలర్ల తాకిడికి వణికి పోయింది. విరాట్ కోహ్లీ(31), అక్షర్ పటేల్(29) తప్ప మిగతావారేవరూ ఆకట్టుకోలేదు. సూర్య కుమార్ యాదవ్, షమీ గోల్డెన్ డక్‌గా ఔట య్యారు. మొదటి వన్డేలో మెరిసిన రాహుల్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. మొత్తానికి భారత్ 26 ఓవర్లకు 117 పరుగులకు కుప్పకూలింది. చివరిలో అక్షర్ పటేల్ బ్యాట్ ఝుళిపించకపోయి ఉంటే భారత్ ఈ మాత్రమైనా స్కోరు చేసేది కాదు.

India vs Australia
ఇక అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలి వన్డేలో బీభత్సమైన ఆట తీరుతో మెరిపించిన ఓపెనర్ షాన్ మార్ష్ ఈ మ్యాచ్‌లోనూ మెరిశాడు. 36 బంతులో 66 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉండేందుకే ఇబ్బ్దంది పడిన చోట అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో భారత బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ హెడ్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. అతడు 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి. మొత్తం 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని ఛేదించడం గమనార్హం.

India vs Australia
బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయగా.. భారత బౌలర్లు మాత్రం దారుణంగా బౌలింగ్ చేశారు. షమీ, సిరాజ్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇలా ఐదుగురు బౌలర్లతో రోహిత్ శర్మ మార్చి మార్చి బౌలింగ్ చేయించిన ఉపయోగం లేకుండాపోయింది. ముంబైలో ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు.. విశాఖపట్టణంలో ఒక్క వికెట్ తీసేందుకు చెమటోడ్చారు. బౌలర్ ఎవరనే ది చూడకుండా ఆస్ట్రేలియా బ్యాటర్లు టీ-20 స్థాయిలో బ్యాటింగ్ చేశారు. 11 ఓవర్లలోనే వారు లక్ష్యాన్ని పూర్తి చేశారంటే బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.